Tollywood: టాలీవుడ్ @ బ్యాడ్ సిట్యువేషన్: స్లాట్స్ ఖాళీగా మళ్లీ రండమ్మా!
- January 23, 2026 / 06:43 PM ISTByFilmy Focus Desk
టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు, హీరోలు, పంపిణీ థియేటర్ల ఓనర్ల చేతుల్లోంచి ఓటీటీల్లోకి వెళ్లిపోయింది. ఈ మాట వినడానికి చాలా హార్ష్‌గా ఉంది అనిపించొచ్చు కానీ.. ప్రస్తుతం పరిస్థితి అలానే ఉంది. ఈ విషయం పెద్ద నిర్మాతలు ఎవరూ నేరుగా మాట్లాడటం లేదు చిన్న నిర్మాతలు కొందరు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అలా రీసెంట్‌గా ఓ యువ నిర్మాత మాట్లాడుతూ టాలీవుడ్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సిట్యువేషన్ గురించి చెప్పకనే చెప్పారు. దీంతో ఏంటీ టాలీవుడ్ ఇలాంటి బ్యాడ్ సిట్యువేషన్‌లో ఉందా అనే చర్చ మొదలైంది.
Tollywood
టాలీవుడ్ గురించి కాస్త ఎక్కువ అవగాహన ఉన్నవారికి ఈ పరిస్థితి గురించి ఈజీగానే అర్థమవుతోంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో పెద్ద సినిమాల విడుదల తేదీల విషయంలో సినిమా నిర్మాణ సంస్థలకు ఓటీటీలు అల్టిమేటాలు జారీ చేస్తున్నాయని కొంతమంది వాదన. మీరు ఫలానా తేదీకి సినిమా విడుదల చేయండి.. ఆ తర్వాత మేం అనుకున్న తేదీకి ఓటీటీలోకి తీసుకొస్తామని చెబుతున్నారని ఆ మధ్య సెప్టెంబరు 25కి వచ్చిన ఓ పెద్ద సినిమా విషయంలో ఓ ఓటీటీ అంది అని వార్తలు వచ్చాయి మీకు తెలిసే ఉంటుంది.
ఇక చిన్న సినిమాలు, కాస్త పేరున్న నిర్మాతలు, హీరోలు నటించిన సినమాల విషయంలో సినిమా విడుదలయ్యాకనో, ముందో కొనుక్కున్నప్పుడు ‘మేం ఓ డేట్ అనుకుంటున్నాం.. అప్పుడే స్ట్రీమింగ్ చేయగలం. అప్పటివరకు మీరు ఆగాల్సిందే’ అని సాఫ్ట్‌గా చెబుతున్నాయట ఓటీటీ వర్గాలు. మరికొంతమందిని అయితే ‘స్లాట్స్ ఖాళీగా లేవు’ అని సినిమాను కొనకుండా ఆపేస్తున్నారట. ఎనిమిదేళ్ల క్రితం థియేటర్లలో మామూలుగా సినిమాగా రన్ ముగించి.. ఓటీటీలో మంచి హిట్ కొట్టిన సినిమా సీక్వెల్‌కు ఈ సిట్యువేషన్ ఎదురైందట.
ప్రస్తుతం ఓటీటీ రంగంలో ఉన్న రెండు పెద్ద తలకాయల పరిస్థితి ఇదే అని సమాచారం. ఒకప్పుడు సినిమాలకు టీవీ హక్కుల విషయంలో ఇలాంటి పరిస్థితి ఉండేది. అయితే మరీ ఇంత ఇబ్బందికరంగా ఉండేది కాదు అని చెప్పేవారు. కానీ ఓటీటీ డీల్ మీద ఆధారపడి సినిమాలు చేస్తున్న నిర్మాతలు పెరిగిపోతున్న నేపథ్యంలో టాలీవుడ్‌కి ఈ పరిస్థితి ఎదురైంది అని చెబుతున్నారు.















