ఏపీలో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో జగన్ సర్కార్ కొత్త జీవోను అమలు చేయడంతో ఊహించని స్థాయిలో టికెట్ రేట్లు తగ్గాయి. అయితే తగ్గిన టికెట్ రేట్లతో థియేటర్లను నడపడం సులభం కాదు. సినిమాల బడ్జెట్లు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో తగ్గించిన టికెట్ రేట్ల వల్ల నిర్మాతలు పడుతున్న టెన్షన్ అంతాఇంతా కాదు. ఏపీలో 100 శాతం ఆక్యుపెన్సీ, సెకండ్ షోలకు అనుమతులు వచ్చినా టికెట్ రేట్ల పెంపు గురించి ప్రకటన రాలేదు.
మరోవైపు జగన్ సర్కార్ త్వరలో ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లను అమ్మనున్న నేపథ్యంలో టాలీవుడ్ పెద్దలు కోర్టు మెట్లు ఎక్కాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డిసెంబర్ నెల నుంచి పెద్ద సినిమాలు రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించడం కరెక్ట్ కాదని టాలీవుడ్ ప్రముఖులు కోర్టు మెట్లు ఎక్కబోతున్నారని సమాచారం. ఏదో ఒక విధంగా స్టే వస్తే ఇకపై పాత రేట్లకే సినిమా టికెట్లను అమ్మే వీలు అయితే ఉంటుందని చెప్పవచ్చు.
టికెట్ రేట్ల తగ్గింపు వల్ల లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలకు హిట్ టాక్ వచ్చినా నిర్మాతలకు భారీగా లాభాలు రాలేదు. తక్కువ ధరకే జనానికి వినోదాన్ని అందించాలనే జగన్ ఆలోచన విషయంలో కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. జగన్ సర్కార్ ఇప్పట్లో టికెట్ రేట్లను పెంచదని క్లారిటీ ఉండటంతో కోర్టుకు వెళ్తే సులువుగా స్టే వస్తుందని సినీ ప్రముఖులు భావిస్తున్నట్టు సమాచారం.
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?