Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » పాటల లిరిక్స్ తో వచ్చిన 20 సినిమాల టైటిల్స్ మరియు వాటి రిజల్ట్స్!

పాటల లిరిక్స్ తో వచ్చిన 20 సినిమాల టైటిల్స్ మరియు వాటి రిజల్ట్స్!

  • April 18, 2025 / 03:07 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పాటల లిరిక్స్ తో వచ్చిన 20 సినిమాల టైటిల్స్ మరియు వాటి రిజల్ట్స్!

సినిమాకి టైటిల్స్ పెట్టడం అనేది ఇప్పుడు మేకర్స్ కి పెద్ద ఛాలెంజ్. సినిమా పబ్లిసిటీ మొదలయ్యేదే టైటిల్ దగ్గర్నుండి. అందుకే సరైన టైటిల్ పెట్టడం చాలా ముఖ్యం. అందుకే మేకర్స్ కి ఇది చాలా టఫ్ పార్ట్. అందుకోసమే సరైన టైటిల్ కోసం… గతంలో వచ్చిన సినిమాల టైటిల్స్ లేదా చార్ట్ బస్టర్ సాంగ్ (Songs) లిరిక్స్ తో టైటిల్స్ పెడుతున్నారు. పాత సినిమాల టైటిల్స్ తో వచ్చిన సినిమాలను తాజాగా ముచ్చటించుకున్నాం. ఇప్పుడు చార్ట్ బస్టర్ సాంగ్స్ (Songs) లిరిక్స్ తో వచ్చిన సినిమాల టైటిల్స్ ను వాటి రిజల్ట్స్ ను ఓ లుక్కేద్దాం రండి :

Songs

1) ఊహలు గుసగుసలాడే (Oohalu Gusagusalade) :

సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR), కృష్ణకుమారి జంటగా నటించిన ‘బందిపోటు’ సినిమాలో ఊహలు గుసగుసలాడే అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ ను ఆధారం చేసుకొని నాగశౌర్య (Naga Shaurya), రాశీ ఖన్నా (Raashi Khanna) జంటగా నటించిన సినిమాకి ‘ఊహలు గుసగుసలాడే’ అనే టైటిల్ ను పెట్టారు. అవసరాల శ్రీనివాస్ (Srinivas Avasarala) ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా డీసెంట్ సక్సెస్ అందుకుంది.

2) ఒక లైలా కోసం (Oka Laila Kosam) :

అక్కినేని నాగేశ్వరరావు (ANR), జయసుధ (Jayasudha) హీరోహీరోయిన్లుగా రూపొందిన ‘రాముడు కాదు కృష్ణుడు’ సినిమాలో ఒక లైలా కోసం అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. దర్శకరత్న దాసరి నారాయణరావు రాసిన పాట అది. ఆ పాటలోని లిరిక్స్ ను ఆధారం చేసుకొని నాగ చైతన్య (Naga Chaitanya), పూజా హెగ్డే (Pooja Hegde)..ల సినిమాకి ‘ఒక లైలా కోసం’ అనే టైటిల్ ను పెట్టారు. ఈ సినిమా ఓ మోస్తరు విజయాన్ని అందుకుంది.

3) ఆడవారి మాటలకు అర్థాలే వేరులే (Aadavari Matalaku Arthale Verule) :

సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి కాంబినేషన్లో ‘మిస్సమ్మ’ అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఈ సినిమాలో ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అనే పాట ఉంటుంది. తర్వాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఖుషి’ (Kushi) సినిమాలో కూడా ఇలాంటి లిరిక్స్ తో ఓ పాట ఉంటుంది. ఈ పాటల్లోని లిరిక్స్ ఆధారంగా వెంకటేష్ (Venkatesh Daggubati), త్రిష (Trisha) నటించిన సినిమాకి ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ అనే టైటిల్ పెట్టాడు దర్శకుడు శ్రీ రాఘవ అలియాస్ సెల్వ రాఘవన్ (Selvaraghavan Kasthuri Raja). ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

4) భలే భలే మగాడివోయ్ (Bhale Bhale Magadivoy) :

కమల్ హాసన్, సరిత, మాధవి కాంబినేషన్లో రూపొందిన ‘మరో చరిత్ర’ సినిమాలో భలే భలే మగాడివోయ్ అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఈ పాటలోని లిరిక్స్ ఆధారంగా నాని (Nani) సినిమాకి ‘భలే భలే మగాడివోయ్’ అనే టైటిల్ ని పెట్టాడు దర్శకుడు మారుతి (Maruthi Dasari). ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

5) సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు (Seethamma Andalu Ramayya Sitralu) :

కమల్ హాసన్, ఆమని కాంబినేషన్లో వచ్చిన ‘శుభ సంకల్పం’ సినిమాలో సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు  అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ లిరిక్స్ ను రాజ్ తరుణ్ (Raj Tarun) 4వ సినిమాకి టైటిల్ గా పెట్టారు. అయితే ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

6) మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు (Malli Malli Idi Rani Roju) :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘రాక్షసుడు’ సినిమాలో మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఈ సినిమా లిరిక్స్ ఆధారంగా శర్వానంద్ (Sharwanand), నిత్యా మేనన్ (Nithya Menen) కాంబినేషన్లో వచ్చిన సినిమాకి ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ అనే టైటిల్ పెట్టారు. ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది.

7) ఎటో వెళ్ళిపోయింది మనసు (Yeto Vellipoyindhi Manasu) :

అక్కినేని నాగార్జున (Nagarjuna) హీరోగా ‘నిన్నే పెళ్ళాడతా’ (Ninne Pelladata) అనే సూపర్ హిట్ సినిమా వచ్చింది. ఇందులో ఎటో వెళ్ళిపోయింది మనసు అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఈ పాట ఆధారంగా నాని సినిమాకి ‘ఎటో వెళ్ళిపోయింది మనసు’ అనే టైటిల్ ను పెట్టాడు దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Vasudev Menon). ఈ సినిమా పెద్దగా ఆడలేదు.

8) చెప్పవే చిరుగాలి :

మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా వచ్చిన ‘ఒక్కడు’ (Okkadu) అనే సూపర్ హిట్ మూవీలో చెప్పవే చిరుగాలి అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంది. దీని ఆధారంగా వేణు (Venu), ‘వసంతం’ (Vasantam) విక్రమన్ కాంబినేషన్లో వచ్చిన సినిమాకి ‘చెప్పవే చిరుగాలి’ అనే టైటిల్ ను పెట్టారు. ఈ సినిమా యావరేజ్ గా ఆడింది.

9) నువ్వొస్తానంటే నేనొద్దంటానా (Nuvvostanante Nenoddantana) :

ప్రభాస్ (Prabhas), త్రిష జంటగా నటించిన ‘వర్షం’ (Varsham) అనే సూపర్ హిట్ సినిమాలో నువ్వొస్తానంటే నేనొద్దంటానా అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఈ లిరిక్స్ ను ఆధారం చేసుకొని సిద్దార్థ్ (Siddharth) సినిమాకి ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది.

10) గోదారి గట్టుపైన :

మహేష్ బాబు డెబ్యూ మూవీ ‘రాజకుమారుడు’ (Rajakumarudu) లో ‘గోదారి గట్టుపైన’ అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఈ లిరిక్స్ ను ఆధారం చేసుకొని సుమంత్ ప్రభాస్ కొత్త సినిమాకి ‘గోదారి గట్టుపైన’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

11) మిస్టర్ పర్ఫెక్ట్ (Mr. perfect) :

అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా వచ్చిన ‘ఆర్య 2’ (Aarya 2) సినిమాలో మిస్టర్ పర్ఫెక్ట్ అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ ను ఆధారం చేసుకొని ప్రభాస్ (Prabhas), కాజల్ (Kajal Aggarwal) సినిమాకి ‘మిస్టర్ పర్ఫెక్ట్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇది సూపర్ హిట్ అయ్యింది.

12) పిల్లా నువ్వు లేని జీవితం (Pilla Nuvvu Leni Jeevitam) :

పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ ‘గబ్బర్ సింగ్’ (Gabbar Singh) సినిమాలో పిల్లా నువ్వు లేని జీవితం అనే సూపర్ హిట్ సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ ను ఆధారం చేసుకొని సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) డెబ్యూ మూవీకి ‘పిల్లా నువ్వు లేని జీవితం’ అనే టైటిల్ ను పెట్టారు. ఇది కూడా హిట్ అయ్యింది.

13) కాటమరాయుడు ( Katamarayudu):

పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ (Trivikram) కాంబోలో వచ్చిన ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) సినిమాలో కాటమ రాయుడా కదిరి నరసింహుడా అనే పాట ఉంటుంది. ఆ లిరిక్స్ ను ఆధారం చేసుకొని పవన్ కళ్యాణ్ – డాలి సినిమాకి ‘కాటమరాయుడు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ సినిమా ప్లాప్ అయ్యింది.

14) ఎవడే సుబ్రహ్మణ్యం (Yevade Subramanyam) :

సిద్దార్థ్ (Siddharth), తమన్నా (Tamannaah Bhatia) జంటగా నటించిన ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ (Konchem Ishtam Konchem Kashtam) అనే సినిమా వచ్చింది. ఇందులో ఎవడే సుబ్రహ్మణ్యం అనే పాట ఉంటుంది. ఆ లిరిక్స్ ను ఆధారం చేసుకొని నాని సినిమాకి ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే టైటిల్ ను పెట్టాడు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin).

15) చిన్నదాన నీకోసం :

నితిన్ (Nithiin),నిత్యా మేనన్ (Nithya Menen) జంటగా నటించిన ‘ఇష్క్’ సినిమాలోని ‘చిన్నదాన నీకోసం’ అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఈ లిరిక్స్ ను ఆధారం చేసుకొని నితిన్ తో చేసిన సినిమాకి ‘చిన్నదాన నీకోసం’ అనే టైటిల్ పెట్టాడు దర్శకుడు కరుణాకరణ్ (Karunakaran). ఈ సినిమా జస్ట్ యావరేజ్ గా ఆడింది.

16) సినిమా చూపిస్త మావ (Cinema Chupista Maava) :

అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ ‘రేసు గుర్రం’ (Race Gurram) లో సినిమా చూపిస్త మావ అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ ను ఆధారం చేసుకొని రాజ్ తరుణ్ నటించిన సినిమాకి ‘సినిమా చూపిస్త మావ’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు దర్శకుడు త్రినాథరావ్ నక్కిన (Trinadha Rao). ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

17) ఒకే ఒక జీవితం (Oke Oka Jeevitham) :

మంచు మనోజ్ (Manchu Manoj) హీరోగా ‘మిస్టర్ నూకయ్య’ (Mr. Nookayya) సినిమా వచ్చింది. ఇందులో ఒకే ఒక జీవితం అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ ను ఆధారం చేసుకొని శర్వానంద్ (Sharwanand) సినిమాకి ‘ఒకే ఒక జీవితం’ అనే టైటిల్ పెట్టారు. ఇది మంచి హిట్ అయ్యింది.

18) సామజవరగమన (Samajavaragamana) :

అల్లు అర్జున్ (Allu Arjun), త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramuloo) సినిమాలో సామజవరగమన అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ ను ఆధారం చేసుకొని శ్రీవిష్ణు (Sree Vishnu) సినిమాకి ‘సామజవరగమన’ అనే టైటిల్ పెట్టారు. అది కూడా సూపర్ హిట్ అయ్యింది.

19) బుట్ట బొమ్మ (Butta Bomma) :

అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమాలో బుట్ట బొమ్మ అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ ను ఆధారం చేసుకొని ‘కప్పెల’ అనే రీమేక్ సినిమాకి ‘బుట్ట బొమ్మ’ అనే టైటిల్ పెట్టారు.

20) జత కలిసే :

మహేష్ బాబు సూపర్ హిట్ మూవీ ‘శ్రీమంతుడు’ (Srimanthudu) లో జత కలిసే అనే చార్ట్ బస్టర్ సాంగ్ ఉంటుంది. ఆ లిరిక్స్ ను ఆధారం చేసుకొని అశ్విన్ బాబు (Ashwin babu) నటించిన ఓ సినిమాకు ‘జత కలిసే’ అనే టైటిల్ పెట్టారు. అది యావరేజ్ గా ఆడింది.

అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhale Bhale Magadivoy
  • #Katamarayudu
  • #Malli Malli Idi Rani Roju
  • #Nuvvostanante Nenoddantana
  • #Oohalu Gusagusalad

Also Read

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

Peddi: ‘పెద్ది’ లో జాన్వీ కపూర్ డూప్ గా చేస్తున్న నటి ఎవరో తెలుసా?

related news

Re-Release: 15 రోజులు పదికిపైగా రీరిలీజ్‌లు.. ఓవర్‌ డోస్‌ అవ్వడం లేదా?

Re-Release: 15 రోజులు పదికిపైగా రీరిలీజ్‌లు.. ఓవర్‌ డోస్‌ అవ్వడం లేదా?

trending news

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

3 hours ago
Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

5 hours ago
Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

Kamakshi Bhaskarla: ఆ ఇంటిమేట్ సీన్ సినిమాకి అవసరం కాబట్టే చేశాను… కానీ?

7 hours ago
Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

Kamakshi Bhaskarla: పొలిమేర ఫేమ్ కామాక్షిలో ఇన్ని టాలెంట్స్ ఉన్నాయా?

7 hours ago

latest news

IBOMMA: ‘ఐబొమ్మ’ రవి ‘ఎగ్జిట్ ప్లాన్’.. ఆస్తులమ్మేలోపే దొరికాడు!

IBOMMA: ‘ఐబొమ్మ’ రవి ‘ఎగ్జిట్ ప్లాన్’.. ఆస్తులమ్మేలోపే దొరికాడు!

6 hours ago
Vicky Koushal: భుజాన కెమెరాతో వాష్‌రూమ్‌కి వెళ్లిన స్టార్‌ హీరో.. ఆ తర్వాత ఏమైందంటే?

Vicky Koushal: భుజాన కెమెరాతో వాష్‌రూమ్‌కి వెళ్లిన స్టార్‌ హీరో.. ఆ తర్వాత ఏమైందంటే?

6 hours ago
Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

6 hours ago
Kriti Sanon: కాజోల్‌కే కాదు కృతి సనన్‌కి కూడా అదే అనుభవం.. మరోసారి వీడియో వైరల్‌

Kriti Sanon: కాజోల్‌కే కాదు కృతి సనన్‌కి కూడా అదే అనుభవం.. మరోసారి వీడియో వైరల్‌

6 hours ago
Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

Honey Rose: సినిమాలు కంటే, ‘రిబ్బన్ కటిగ్స్ తోనే గట్టిగా సంపాదిస్తున్న బ్యూటీ

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version