ఓ పెద్ద సినిమా రిలీజ్ అంటే.. చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తుంటారు దర్శక నిర్మాతలు. ఒకప్పుడు సినిమా రిలీజ్ అంటే ప్రింట్లు వెళ్లాల్సి ఉండేది. టైంకి కనుక ప్రింట్ లు విడుదల రోజున థియేటర్లకు చేరుకోకపోతే చాలా గొడవలు సంభవించేవి. పెద్ద హీరోల సినిమాలకి కనుక ఇలా జరిగితే అభిమానులు థియేటర్లను ధ్వంసం చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి.ఇప్పుడైతే శాటిలైట్ సిస్టం వచ్చేసింది కాబట్టి.. అన్ని ఏరియాలకి కాపీలు పంపితే సరిపోతుంది. ఇప్పుడైనా టైంకి కాపీలు చేరుకోకపోతే గొడవలు అయ్యే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి. గతేడాది రవితేజ ‘క్రాక్’ సినిమా ఆర్థిక లావాదేవీల కారణంగా కాపీలు ఆగిపోయాయి. ఆ టైములో ఎంత రచ్చ జరిగిందో ప్రత్యక్షంగా చూశాము.
ఇలాంటి వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఓ పెద్ద సినిమాని గ్రాండ్ గా విడుదల చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పట్లో ఓ పెద్ద సినిమాని వేలకు వేల స్క్రీన్స్ లో విడుదల చేస్తున్నారు బడా నిర్మాతలు. అలా చేస్తేనే రికార్డ్ ఓపెనింగ్స్ నమోదవుతాయి. లేదంటే ఆ సినిమాలు రికార్డులు కొట్టే ఛాన్స్ ఉండదు.ముఖ్యంగా పెద్ద సినిమాలు విడుదల రోజున ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అవుతాయి. ఈరోజు విడుదలైన మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ భారీ స్థాయిలో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా ఎన్ని స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పటివరకు తెలుగు సినిమాల్లో ఎక్కువ స్క్రీన్స్ లో రిలీజ్ అయిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఆర్.ఆర్.ఆర్ :
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, చరణ్ లు హీరోలుగా బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్‌గణ్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 10200కు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. ‘బాహుబలి'(సిరీస్) ను మించి ఈ మూవీ భారీ రిలీజ్ ను సొంతం చేసుకుంది.
2) బాహుబలి 2 :
రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ‘బాహుబలి 2’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 8700కి పైగా స్క్రీన్స్ లో విడుదల అయ్యింది.
3) సాహో :
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 7978 స్క్రీన్స్‌లో భారీగా విడుదలైంది.
4) రాధే శ్యామ్ :
ప్రభాస్ హీరోగా రాధా కృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా7010 స్క్రీన్స్‌లో విడుదలైంది.
5) సైరా నరసింహారెడ్డి :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4650 కి పైగా స్క్రీన్స్ లో విడుదలైంది.
6) బాహుబలి ది బిగినింగ్ :
ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రానా కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 4000 కి పైగా స్క్రీన్స్ లో విడుదలైంది.
7) పుష్ప ది బిగినింగ్ :
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ఫహాద్ ఫాజిల్ కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 3000 కి పైగా స్క్రీన్స్ లో విడుదలైంది.
8) అజ్ఞాతవాసి :
పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2800 స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యింది.
9) సర్ధార్ గబ్బర్ సింగ్ :
పవన్ కళ్యాణ్ హీరోగా బాబీ(కె.యస్.రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2600 స్క్రీన్స్‌లో విడుదలైంది.
10) స్పైడర్ :
మహేష్ బాబు- ఏ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2400 స్క్రీన్స్‌లో విడుదలైంది.
11) భరత్ అను నేను :
మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 2400 స్క్రీన్స్‌లో విడుదలైంది.
12) అరవింద సమేత :
ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 2300 స్క్రీన్స్‌లో విడుదలైంది.
13) వకీల్ సాబ్:
పవన్ కళ్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 2174 స్క్రీన్స్‌లో విడుదలైంది.
14) సర్కారు వారి పాట :
మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2150 పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది.
15) ఆచార్య :
చిరంజీవి- రాంచరణ్- కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 2070 స్క్రీన్స్ లో విడుదలైంది.
16) కాటమరాయుడు :
పవన్ కళ్యాణ్ హీరోగా డాలీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 2050 స్క్రీన్స్‌లో విడుదలైంది.
17) మహర్షి :
మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1900 స్క్రీన్స్‌లలో విడుదలైంది.
18) భీమ్లా నాయక్ :
పవన్ కళ్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 1875 స్క్రీన్స్‌లో విడుదలైంది.
19) ఖైదీ నెంబర్ 150 :
ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 1800 స్క్రీన్స్‌లో విడుదలైంది.
20) రంగస్థలం:
చరణ్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 1650 స్క్రీన్స్‌లో విడుదలైంది.