2022 ఏడాది మరో రెండు వారాల్లో ముగియనుంది.. ఎప్పటిలానే కొత్త ఆశలతో కొత్త సంవత్సరంలోకి ప్రవేశించనుంది తెలుగు ఇండస్ట్రీ.. పాండమిక్ కారణంగా రెండేళ్లకు పైగా నానా ఇబ్బందులు పడిన చలనచిత్ర పరిశ్రమకి పోయిన సంవత్సరం చివరి నెలలో వచ్చిన ‘అఖండ’, ‘పుష్ప’ సినిమాలు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి.. ఈ ఏడది ‘ఆర్ఆర్ఆర్’ ఇండస్ట్రీ హిట్‌గా నిలవడమేకాక.. ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా సత్తా ఏంటనేది మరోసారి రుచి చూపించింది..
‘మేజర్’, ‘సీతా రామం’, ‘బింబిసార’, ‘కార్తికేయ 2’, ‘హిట్ – 2’ వంటి పలు సినిమాలు టాలీవుడ్‌కి మరింత బలాన్నిచ్చాయి.. తెలుగుతో పాటు కన్నడ నుండి ‘కేజీఎఫ్ 2’, ‘కాంతార’.. తమిళ్ నుండి ‘విక్రమ్’, ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి.. ట్రిపులార్, పుష్ప చిత్రాలు రష్యా, జపాన్ వంటి దేశాల్లోనూ విడుదలై ఆకట్టుకుంటున్నాయి..
ఇప్పటికే పలు పాపులర్ వెబ్ సైట్స్, నేషనల్ లెవల్లో పేరొందిన మీడియా సంస్థలు 2022లో సౌత్ సినిమాలకు సంబంధించిన రివ్యూస్, రేటింగ్స్ అండ్ ర్యాంకింగ్స్ ఇస్తున్నాయి.. కలెక్షన్ల నుండి టాప్ టెన్ లిస్ట్ వరకు ప్రతీది పరిశీలించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేస్తున్నారు.. ఐఎండీబీ ఐఎండీబీ ఈ ఏడాది పాపులర్ ఇండియన్ మూవీస్ ఏవి?.. ఏ ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు టాప్ 10లో ఉన్నాయి?.. ఏ సినిమాల గురించి జనాలు ఎక్కువగా సెర్చ్ చేశారు అనే వివరాలు వెల్లడించింది..
ఇప్పుడు తెలుగు టాప్ 10 సినిమాల లిస్టు, వాటి రేటింగ్‌తో సహా ప్రకటించింది.. వాటిలో ‘సీతా రామం’ ఫస్ట్ ప్లేస్ దక్కించుకుంది.. మిగతా తెలుగు సినిమాల ప్లేసెస్, ర్యాంకింగ్స్ డీటేల్స్ ఈ విధంగా ఉన్నాయి..