Tollywood: బాక్సాఫీస్ వార్.. నెక్స్ట్ అల్లు అర్జున్ vs ప్రభాస్!
- January 22, 2026 / 05:38 PM ISTByFilmy Focus Writer
ప్రస్తుతం టాలీవుడ్‌లో నంబర్ వన్ పీఠం ఎవరిది అనే చర్చ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఒకప్పుడు టాలీవుడ్ అంటే కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం, కానీ ఇప్పుడు గ్లోబల్ లెవల్లో మన హీరోల సత్తా చాటుతున్నారు. ఈ రేసులో రెబల్ స్టార్ ప్రభాస్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మధ్య గట్టి పోటీ నెలకొంది. వీరిద్దరిలో నేషనల్ వైడ్ గా ఎవరి మేనియా ఎక్కువగా ఉందనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్.
Tollywood
బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ సృష్టించిన ఇంపాక్ట్ అంతా ఇంతా కాదు. ఆయన సినిమాలకు వచ్చే ఓపెనింగ్స్ చూసి నార్త్ స్టార్స్ సైతం షాక్ అవుతుంటారు. ప్రభాస్ సినిమా అంటే మినిమం 100 కోట్ల ఓపెనింగ్స్ గ్యారెంటీ అనే రేంజ్‌కు ఆయన చేరుకున్నారు. అయితే రీసెంట్ గా ‘ది రాజా సాబ్’ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, ప్రభాస్ తన సబ్జెక్ట్ సెలెక్షన్‌లో ఇంకాస్త జాగ్రత్త వహించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చేతిలో ఉన్న ‘స్పిరిట్’, ‘సలార్ 2’ వంటి సినిమాలు మళ్ళీ తిరుగులేని కింగ్‌గా నిలబెట్టే అవకాశం ఉంది.
మరోవైపు అల్లు అర్జున్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ‘పుష్ప’తో హిందీ బెల్ట్‌లో సంపాదించుకున్న క్రేజ్ చూస్తుంటే, ప్రభాస్ నేషనల్ బ్రాండ్‌కు బన్నీ గట్టి సవాల్ విసురుతున్నట్లు అనిపిస్తోంది. బన్నీ కేవలం ఒక్క సినిమాతో హిట్ కొట్టడమే కాదు, లాంగ్ రన్‌లో తన సినిమాలకు వసూళ్ల వర్షం కురిపిస్తున్నారు. అట్లీ దర్శకత్వంలో రాబోతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ మరియు లోకేష్ కనగరాజ్ ప్రాజెక్టులతో బన్నీ గ్లోబల్ స్టార్‌డమ్ వైపు అడుగులు వేస్తున్నారు. డెడికేషన్ స్టైల్ ఉత్తరాది ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి.
నిజానికి ప్రభాస్ స్కేల్ వేరు, అల్లు అర్జున్ స్టైల్ వేరు. ప్రభాస్ భారీ సెట్లు, వీఎఫ్ఎక్స్ విజువల్ వండర్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటే, బన్నీ తన యాక్టింగ్, డాన్స్, పెర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. ట్రేడ్ వర్గాల ప్రకారం, ప్రస్తుతం ప్రభాస్ ఓపెనింగ్స్ పరంగా టాప్‌లో ఉన్నా, నిలకడైన సక్సెస్ రేటులో బన్నీ ముందంజలో ఉన్నారు. ఈ ఇద్దరు స్టార్స్ రాబోయే సినిమాలతో ఎవరు ఎవరిని అధిగమిస్తారో చూడాలి.













