సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఈ మధ్యకాలంలో తన స్థాయిని తగ్గించుకొని సినిమాలు చేస్తున్నారు. నాసిరకంగా కథలతో తక్కువ బడ్జెట్ లో సినిమాలు తీస్తూ.. డబ్బు చేసుకోవాలనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా ‘లడకీ’ అనే సినిమాను తెరకెక్కించారాయన. ఈ సినిమాపై వర్మ చాలా ఆశలు పెట్టుకున్నారు. చైనీస్ ప్రొడక్షన్ హౌస్ తో కలిసి మంచి బడ్జెట్ తో సినిమాను రూపొందించారు. ఈ సినిమాను ‘అమ్మాయి’ అనే పేరుతో తెలుగులో రిలీజ్ చేశారు.
పూజా భలేకర్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ప్రదర్శనను నిలిపివేయాలంటూ టాలీవుడ్ కి చెందిన నిర్మాత కె.శేఖర్ రాజు కోర్టుని ఆశ్రయించారు. దీంతో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో సుడిగాలి సుధీర్ హీరోగా ‘సాఫ్ట్ వేర్ సుధీర్’ అనే సినిమాను నిర్మించిన శేఖర్ రాజు.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించాలని భావించారు.
ఆ మేరకు ఆయన్ను కలవడం కూడా జరిగిందని.. అప్పటి నుంచి సినిమా కోసం పలు దఫాలుగా లక్షలాది రూపాయలు తీసుకున్న వర్మ సినిమాను మాత్రం మొదలుపెట్టడం లేదని శేఖర్ రాజు అన్నారు. గట్టిగా ప్రశ్నిస్తే తప్పించుకుంటూ వస్తున్నారని శేఖర్ రాజు వివరించారు. తన డబ్బులు తిరిగి ఇవ్వకపోగా.. సరిగ్గా సమాధానాలు కూడా చెప్పడం లేదని శేఖర్ రాజు తెలిపారు. అందుకే తన దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తో కోర్టుని ఆశ్రయించానని వెల్లడించారు.
ఈ క్రమంలో వర్మ తెరకెక్కించిన ‘లడకీ’ సినిమాను అన్ని భాషల్లో ప్రదర్శన నిలిపివేస్తూ కోర్టు ఆర్డర్స్ జారీ చేసిందని శేఖర్ రాజు పేర్కొన్నారు. అలానే డిజిటల్ రిలీజ్ ను కూడా హోల్డ్ లో పెట్టాలని కోర్టు ఉతర్వులు ఇచ్చిందని వెల్లడించారు. మరి ఈ ఇష్యూపై వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి!
Most Recommended Video
రెండో సినిమా సెంటిమెంట్ నుండి తప్పించుకోలేకపోయిన టాలెంటెడ్ డైరెక్టర్ల లిస్ట్…!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!
ఐ.ఎం.డి.బి వారి లెక్కల ప్రకారం ఈ ఏడాది ప్రధార్థంలో టాప్ 10 మూవీస్ లిస్ట్..!