Tollywood: ఆ హీరోల రెమ్యునరేషన్లను తగ్గిస్తారట.. వాళ్లకు షాక్ అంటూ?

ఈ మధ్య కాలంలో ఏ సినిమా రిలీజవుతున్నా ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కు ఆ సినిమా సాధిస్తున్న కలెక్షన్లకు పొంతన ఉండటం లేదు. ప్రేక్షకుల్లో భారీ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోల పరిస్థితి ఈ విధంగా ఉండటంతో ఆయా హీరోల అభిమానులు షాకవుతున్నారు. గత నెలలో విడుదలైన అంటే సుందరానికి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదనే సంగతి తెలిసిందే.

ఈ నెలలో పక్కా కమర్షియల్, ది వారియర్, థాంక్యూ సినిమాలు కొన్ని వారాల గ్యాప్ లో విడుదల కాగా ఈ సినిమాలలో ఒక్క సినిమా కూడా బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవైపు ప్రముఖ ఓటీటీ సంస్థలు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను సాధిస్తుంటే మరోవైపు సింగిల్ స్క్రీన్ థియేటర్ల ఓనర్లు మాత్రం నష్టాలు రావడంతో థియేటర్లను మూసివేసే పరిస్థితి ఎదురవుతుండటం గమనార్హం. అయితే టాలీవుడ్ హీరోల, దర్శకుల రెమ్యునరేషన్లను తగ్గించడం ద్వారా ఈ పరిస్థితికి చెక్ పెట్టాలని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ప్రయత్నిస్తోంది.

అయితే ఈ కమిటీ ఆరుగురు టాలీవుడ్ స్టార్ హీరోల జోలికి కొంతమంది స్టార్ డైరెక్టర్ల జోలికి మాత్రం పోదని బోగట్టా. ప్రభాస్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, రాజమౌళి, సుకుమార్, త్రివిక్రమ్, కొరటాల శివ మరి కొందరు డైరెక్టర్ల రెమ్యునరేషన్లలో ఎలాంటి మార్పులు ఉండవని బోగట్టా. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఊహించని స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్న ఈ ఆరుగురు స్టార్ హీరోలను మాత్రం ప్రత్యేకంగా చూస్తుండటం గమనార్హం.

సీనియర్ స్టార్ హీరోలు, మిడిల్ రేంజ్ హీరోలు, చిన్న హీరోల రెమ్యునరేషన్లు మాత్రం తగ్గే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే నిర్మాతలు ఈ విధంగా నిబంధనలు జారీ చేసినా హీరోలు ఎక్కువ మొత్తం పారితోషికం డిమాండ్ చేస్తే మాత్రం అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus