సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఏదో ఒక బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుంది. శరత్ బాబు మరణం అనంతరం.. రాకేష్ మాస్టర్ వంటి వారు మరణించారు. ఇంకా చాలా మంది నిర్మాతలు, దర్శకులు, చార్లీ చాప్లిన్ కూతురు, యూట్యూబర్లు, సింగర్స్, యాంకర్స్ వంటివారు కూడా మరణించిన సంగతి తెలిసిందే. కొంతమంది అనారోగ్య సమస్యలతో.. మరికొంత మంది రోడ్డు ప్రమాదంలో, మరికొంతమంది వయసు సంబంధిత సమస్యలతో, ఇంకా కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
ఇదిలా ఉండగా.. తాజాగా మరో టాలీవుడ్ దర్శకుడు కన్నుమూయడం అందరినీ విషాదంలోకి నెట్టేసినట్టైంది. వివరాల్లోకి వెళితే…దివంగత స్టార్ డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ గారి పెద్దబ్బాయి ఆర్యన్ రాజేష్ హీరోగా మూవీ మొఘల్ డా.డి.రామానాయుడు నిర్మాణంలో రూపొందిన ‘నిరీక్షణ’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్ ఈరోజు మరణించారు. ఈయన వయసు కేవలం 49 ఏళ్ళు మాత్రమే కావడం గమనార్హం. ‘సీతారామ్’గా పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చిన ప్రసాద్… శ్రీకాంత్ తో ‘శత్రువు’, నవదీప్ తో ‘నటుడు’ చిత్రాలను కూడా డైరెక్ట్ చేశారు.
అలాగే (Director) ప్రసాద్ దర్శకత్వంలో రూపొందిన ‘రెక్కి’ అనే మరో సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇలాంటి టైంలో ప్రసాద్ ఇలా అయిపోవడం విచారకరం. గతంలో ప్రసాద్.. పలువురు ప్రముఖ దర్శకుల వద్ద రైటర్ గా అలాగే ఘోస్ట్ రైటర్ గా పనిచేశారు. ఇతని స్వస్థలం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లాలో కి చెందిన జంగారెడ్డిగూడెం. ఇక ప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కొందరు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!
‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!