Varun,Lavanya: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రిజెక్ట్ చేయడంతో లావణ్య మెగా కోడలు అయిందా?

  • December 12, 2023 / 03:35 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నటువంటి వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిల వివాహ వేడుక నవంబర్ ఒకటవ తేదీ ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి మనకు తెలిసిందే. ఇలా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి మిస్టర్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడి వీరి రిలేషన్ ని చాలా సీక్రెట్ గా మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే నవంబర్ ఒకటో తేదీ వీరిద్దరూ ఎంతో ఘనంగా కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు.

ఈ విధంగా వరుణ్ తేజ్ లావణ్య వివాహ వేడుకకు సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ జంట ఫిన్లాండ్ హనీమూన్ వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. వీరి హనీమూన్ వెకేషన్ కి సంబంధించినటువంటి ఫోటోలను వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి వీరి సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా వీరిద్దరి పెళ్లి జరగడానికి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కారణం అంటూ ఒక వార్త వైరల్ గా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లో కొనసాగుతున్నటువంటి సమంత వరుణ్ తేజ్ లావణ్య పెళ్లి జరగడానికి కారణమని సమంత రిజెక్ట్ చేయడంతోనే లావణ్య త్రిపాఠి మెగా కోడలు అయింది అంటూ ఒక వార్త సంచలనంగా మారింది. అసలు సమంతకు లావణ్య త్రిపాఠికి సంబంధం ఏంటి అనే విషయానికి వస్తే… శీను వైట్ల ఈ సినిమాలో హీరోయిన్ స్థానంలో లావణ్య త్రిపాటి కంటే ముందుగా సమంతను సంప్రదించారట.

కథ మొత్తం విన్నటువంటి సమంత ఈ సినిమా కథ నచ్చకపోవడంతో రిజెక్ట్ చేశారని తెలుస్తుంది. ఇలా సమంత రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి భాగమయ్యారు. ఇలా ఈ సినిమాలో ఈమె వరుణ్ తేజ్ తో కలిసి నటించడం వల్ల ఇద్దరు ప్రేమలో పడ్డారని అనంతరం వీరిద్దరూ నిజజీవితంలో కూడా ఒక్క టయారైన తెలుస్తుంది. కేవలం సమంత ఈ సినిమాని రిజెక్ట్ చేయటం వల్లే (Lavanya) లావణ్య త్రిపాఠి మెగా కోడలుగా అడుగుపెట్టారు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus