Actress: విడాకుల పై స్పందించిన స్టార్ హీరోయిన్!

‘బాంబే’, ‘భారతీయుడు’, ‘ఒకేఒక్కడు’ వంటి సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది మనీషా కోయిరాలా. తర్వాత రజినీకాంత్ కు జోడీగా ‘బాబా’ అనే మూవీలో కూడా హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో ఆమెకు తమిళంలో అవకాశాలు తగ్గిపోయాయి. అటు తర్వాత హిందీలో కూడా ఈమె హవా తగ్గుతూ వచ్చింది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ను స్టార్ట్ చేసి కిందా మీదా పడి ఆఫర్లు రాబట్టుకుంటుంది.

కానీ అనుకున్న రేంజ్లో అయితే కాదు. తాజాగా ఈమె (Actress) ఓ ఇంటర్వ్యూలో పాల్గొని ఇదే విషయం పై స్పందించింది. అలాగే తన పర్సనల్ లైఫ్ గురించి.. మరీ ముఖ్యంగా తను విడాకులు తీసుకోవడానికి గల కారణాలను కూడా ఈ ఇంటర్వ్యూలో వివరించింది ఈ బ్యూటీ. నేపాల్ కు చెందిన మనీషా కోయిరాలా మొదట సామ్రాట్ దహల్ అనే వ్యక్తిని 2010 లో పెళ్లి చేసుకుంది. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా 2012 లోనే విడాకులు తీసుకుంది.

ఈ విషయం పై ఆమె స్పందిస్తూ.. “పెళ్లి తర్వాత జీవితం ఎంతో అందంగా ఉంటుంది అని కలలు కన్నాను. కానీ 6 నెలలకే నాకు నా భర్తకు మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తే..నాకు శత్రువు అయ్యాడు. స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుంది. అందుకే విడాకులు తీసుకోక తప్పలేదు. నా లాంటి సమస్య ఎవ్వరికీ రాకూడదు. దాంపత్య బంధంలో సంతోషం లేకుంటే కనుక విడిపోవడమే మంచిది” అంటూ చెప్పుకొచ్చింది మనీషా కోయిరాలా.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus