మహేష్, ప్రభాస్ తో ఒకేసారి సినిమా చేసుకుందుకు స్కెచ్ వేసిన బ్రిలియంట్ డైరెక్టర్!

సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఇది వరకు ‘1 నేనొక్కడినే’ అనే సినిమా వచ్చిన విషయం మనకి తెలిసిందే. అయితే రంగస్థలం సినిమా సూపర్ సక్సెస్ తరువాత డైరెక్టర్ సుకుమార్ గారు మహేష్ బాబుతో తన నెక్స్ట్ సినిమాని ప్లాన్ చేస్తున్నారు. మహేష్ 26 వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా, మహేష్ బాబు వంశీ పైడిపెళ్లి దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పూర్తవగానే ఈ సినిమా షూటింగ్ మొదలవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ఇక బాహుబలి సినిమా తరువాత ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ని పెంచుకున్న హీరో ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమా షూటింగ్ బిజీ లో ఉన్నాడు. అయితే ప్రభాస్, సుకుమార్ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ మాములుగా ఉండదు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ కి సుకుమార్ తెలివి తోడైతే ఆ సినిమా పైన అంచనాలు అమాంతంగా పెరిగిపోతాయి. ఇప్పటివరకు అల్లు అర్జున్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ వంటి హీరోలను కొత్తగా చూపించిన సుకుమార్ ఇటు మహేష్ సినిమా చేస్తూనే ప్రభాస్ కోసం ఒక డిఫెరెంట్ స్టోరీ ని రాస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మహేష్ 26 వ సినిమా, ప్రభాస్ 21 వ సినిమా ని సుకుమార్ గారే తీస్తారని సినీ వర్గాలు చెబుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus