వృత్తిపరంగా ఈ డైరెక్టర్ భార్యలు ఏం చేస్తున్నారో తెలుసా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి డైరెక్టర్లు ఉన్నారు ఇలా డైరెక్టర్లుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి పలువురు స్టార్ డైరెక్టర్ల భార్యలు ఎలాంటి వృత్తిలో స్థిరపడ్డారు వారు ఏం చేస్తున్నారు అనే విషయానికి వస్తే… అంతర్జాతీయ స్థాయిలో డైరెక్టర్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో ఎస్ఎస్ రాజమౌళి ఒకరు ఈయన భార్య రమ రాజమౌళి ఆయన సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తారు ఈమె రాజమౌళి సినిమాలకు తప్ప ఏ సినిమాలకు పని చేయరు.

మరో పాన్ ఇండియా స్టార్ట్ డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్ భార్య తబిత ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె ప్రైవేట్ రంగంలో మాత్రం పలు వ్యాపారాలలో రాణిస్తూ ఉన్నారు. రాజమౌళి తర్వాత అపజయమెరుగని హీరోగా గుర్తింపు పొందినటువంటి అనిల్ రావిపూడి భార్య భార్గవి సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరంగా ఉంటూ కేవలం గృహిణిగా స్థిరపడ్డారు ఇక బోయపాటి భార్య విలేఖ కూడా ఇలా గృహిణిగా స్థిరపడ్డారు.

మాటల మాంత్రికుడు (Trivikram) త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి సౌజన్య భరతనాట్యకారిణి అలాగే ఈమె సినిమా ఇండస్ట్రీలు ప్రొడ్యూసర్గా కొనసాగుతూ వచ్చారు. ఈమె పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. మణిరత్నం సతీమణి సుహాసిని కూడ సినిమాలలో పలు కీలక పాత్రలలో నటిస్తూ తన భర్త మణిరత్నంకు అడ్వైజర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇక తెలుగులో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు పొందినటువంటి కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ కూడా ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సతీమణి ప్రియాంక దత్ కూడా ఇండస్ట్రీలో నిర్మాతగా కొనసాగుతూ పలు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే ఇక ఈమె స్వయంగా నిర్మాత అశ్విని దత్ కుమార్తె అన్న విషయం మనకు తెలిసిందే.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus