Star Hero: ఆయన చేసిన పని వల్ల మా నాన్న నాకు కోటింగ్ ఇచ్చేవాడు!

  • September 22, 2023 / 09:06 PM IST

మన టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ స్టార్ ఇమేజి ఉన్న ఇద్దరు ముగ్గురు హీరోలలో ఒకడు దగ్గుపాటి రానా. బాహుబలి సిరీస్ తో ప్రపంచవ్యాప్తంగా ఫేమ్ తెచ్చుకున్నాడు. అయితే ఆ సినిమా తర్వాత రానా కి కొన్ని ఆరోగ్య సమస్యలు రావడం వల్ల సినిమాలకు బాగా బ్రేక్ ఇచ్చాడు. ఆ చిత్రం తర్వాత ఆయన చేసిన సినిమాలు చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ తో కలిసి ‘భీమ్లా నాయక్’ చిత్రం లో నటించాడు.

ఈ సినిమా తర్వాత ఆయన ‘విరాట పర్వం’ అనే సినిమా చేసాడు, రీసెంట్ గానే నెట్ ఫ్లిక్స్ లో తన బాబాయ్ వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చేసాడు. ఈ వెబ్ సిరీస్ ఒక రేంజ్ లో ట్రెండ్ అయ్యింది. ప్రస్తుతం ఆయన ఏ సినిమా చేస్తున్నాడో ఇంకా ఎవరికీ తెలియదు. ఇది ఇలా ఉండగా రానా కి చిన్నతనం నుండి ఉన్న బెస్ట్ ఫరెండ్స్ లో ఒకరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.

వీళ్లిద్దరు కలిసి ఒకే స్కూల్ లో ఒకే క్లాస్ లో చదువుకునేవారు. చిన్నప్పుడు రానా తరచూ చిరంజీవి ఇంటికి వచ్చి రామ్ చరణ్ తో ఆడుకుంటూ ఉండేవాడు. అంతే కాదు వీళ్లిద్దరు కలిసి చిన్నతనం లోనే సినిమాలు, షికార్లు తిరిగేవారు. అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో రానా తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ, చిన్నతనం లో చరణ్ వాళ్ళ నాన్న కి భయపడేవాడు కాదు, అలాగే నేను మా నాన్న కి భయపడేవాడిని కాదు,

కానీ మేమిద్దరం అల్లు అరవింద్ గారికి భయపడేవాళ్ళం. (Star Hero) నా జీవితం లో పెద్ద విలన్ ఈయన. చరణ్ ఇంట్లో దొరికిపోయినప్పుడు, నేను కూడా మా ఇంట్లో దొరికిపోయేవాడిని, అల్లు అరవింద్ గారు మా ఇంటికి ఫోన్ చేసి చెప్పేసేవాడు, నాకు మా నాన్న దగ్గర చాలా కోటింగ్ ఉండేది. అలా నేను చరణ్ అల్లు అరవింద్ గారికి భయపడి చాలా సరదాలు మిస్ అయ్యాము అంటూ చెప్పుకొచ్చాడు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags