పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా కరుణాకరణ్ దర్శకత్వంలో సి.అశ్వినీదత్ నిర్మాణంలో రూపొందిన చిత్రం బాలు. తొలిప్రేమ తర్వాత పవన్ కళ్యాణ్ – కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడంతో.. బాలు పై అప్పట్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2005 లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఆ అంచనాలను మ్యాచ్ చేయలేదు. అలాగని ఫ్లాప్ సినిమాగా కూడా మిగిలిపోలేదు. సంక్రాంతి సీజన్ కలిసొచ్చి బాక్సాఫీస్ వద్ద యావరేజ్ ఫలితాన్ని అందుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ముంబైలో గని ( గ్యాంగ్ స్టర్) అనుకోకుండా ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. తర్వాత అతని పై జరిగిన ఓ దాడిలో ప్రేమించిన అమ్మాయిని కోల్పోతాడు. తర్వాత ఆమెకు ఇచ్చిన మాట ప్రకారం వయోలెన్స్ వద్దని వేరే ఊరికి వెళ్లి సాధారణ జీవితాన్ని గడుపుతాడు. సరిగ్గా ఇదే కథతో మరో సినిమా వచ్చింది. అదే బలుపు చిత్రం. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కూడా రవి తేజ ఫ్లాష్ బ్యాక్ లో ఓ గ్యాంగ్ స్టర్.
తర్వాత అంజలితో ప్రేమలో పడతాడు. ఆమె కోసం విలన్ కు ఎదురెళ్తాడు. తన పై జరిగిన దాడిలో హీరోయిన్ చనిపోతుంది. ఆమె చనిపోయే ముందు వయోలెన్స్ వదిలేసి ఎక్కడికైనా వెళ్లి సాధారణ జీవితాన్ని గడపమని చెబుతుంది. బాలు లో హీరోయిన్ తల్లికి హీరో కొడుకు అవుతాడు. బలుపు లో హీరోయిన్ తండ్రికి హీరో కొడుకు అవుతాడు. ఈ రెండు సినిమాలకు కోన వెంకట్ రైటర్ గా పనిచేశాడు.