Rules Ranjan: ‘రూల్స్ రంజన్’ కి అతను మిస్ అయ్యాడట. చాలా లక్కీ అంతే..!

కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన క్లాస్ అండ్ కామెడీ మూవీ ‘రూల్స్ రంజన్’. టీజర్, ట్రైలర్స్ బాగానే ఉన్నాయి.. కానీ ఈరోజు అనగా అక్టోబర్ 6 న రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షోతోనే ప్లాప్ టాక్ ను మూటగట్టుకుంది. ఏ.ఎం.రత్నం తనయుడు రత్నం కృష్ణ కొంత గ్యాప్ తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఏ.ఎం.రత్నం కూడా ఈ చిత్రానికి సమర్పకులుగా గా వ్యవహరించారు. ఇక సినిమా కామెడీ కొన్ని చోట్ల బాగున్నప్పటికీ..

కథలో కొత్తదనం కానీ వేగం కానీ లేకపోవడం, కిరణ్ అబ్బవరం పెర్ఫార్మన్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేకపోవడంతో ప్లాప్ టాక్ వచ్చినట్టు స్పష్టమవుతుంది. అయితే ఈ చిత్రానికి కిరణ్ అబ్బవరం ఫస్ట్ ఛాయిస్ కాదట. ఈ విషయాన్ని దర్శకుడు రత్నం కృష్ణ చెప్పుకొచ్చాడు. అతను ఈ విషయం పై మాట్లాడుతూ..” ‘రూల్స్ రంజన్’ కి (Rules Ranjan) మొదట కిరణ్ అబ్బవరంని హీరోగా అనుకోలేదు. ముందుగా ఈ కథకి నవీన్ పోలిశెట్టిని హీరోగా అనుకున్నాను.

కానీ కొన్ని కారణాల వల్ల అతన్ని అప్రోచ్ కాలేకపోయాను. అదే టైంలో ‘ఎస్.ఆర్.కళ్యాణమండపం’ హిట్ అయ్యింది. దీంతో కిరణ్ అబ్బవరంని అప్రోచ్ అయ్యాను. అతను కథ విని ఓకే చెప్పేశాడు. అతనిలో హీరో మాత్రమే కాదు మంచి క్రియేటర్ కూడా ఉన్నాడు. అందువల్ల ఈ కథకి అతను పర్ఫెక్ట్ అని డిసైడ్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఏదేమైనా నవీన్ పోలిశెట్టి మాత్రం అదృష్టవంతుడిని రత్నం కృష్ణ మాటలని బట్టి, సినిమా ఫలితాన్ని బట్టి చెప్పొచ్చు.

మ్యాడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ది గ్రేట్ ఇండియన్ సూసైడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మామా మశ్చీంద్ర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus