Gadar Movie: ఆ కారణం వల్లే గద్దర్ సినిమాను ఆ హీరో మిస్ చేసుకున్నాడా..!

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ అటు బాక్స్ ఆఫీస్ పరంగా సెన్సేషనల్ రికార్డ్స్ ని నెలకొల్పి కల్ట్ స్టేటస్ ని కూడా దక్కించుకున్న సినిమాలు చాలా తక్కువగా ఉంటాయి. వాటిల్లో ‘గద్దర్’ అనే చిత్రం ఒకటి. ఈ సినిమాలో హీరోగా ప్రముఖ బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ నటించాడు. ఆరోజుల్లో ఈ సినిమా ఒక సెన్సేషనల్. 2001 వ సంవత్సరం జూన్ 15 వ తారీఖున విడుదలైన ఈ సినిమాతో పాటుగా అమీర్ ఖాన్ లగాన్ చిత్రం కూడా విడుదలైంది.

కానీ గద్దర్ చిత్రం లగాన్ కంటే మూడు రెట్లు ఎక్కువ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ సినిమాకి సీక్వెల్ గా గద్దర్ 2 అని రీసెంట్ గానే విడుదల అయ్యి సుమారుగా 520 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టి రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే గద్దర్ సినిమా గురించి ఎవరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.

అదేమిటంటే 2001 లో విడుదలై సంచలన విజయం సాధించిన (Gadar Movie) ‘గద్దర్’ చిత్రాన్ని తెలుగు లో కూడా రీమేక్ చెయ్యాలని ప్రయత్నాలు గట్టిగానే జరిగాయట. ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు తన కొడుకు విక్టరీ వెంకటేష్ ని పెట్టి ఈ సినిమా చెయ్యాలనుకున్నాడు. వెంకటేష్ కి ఈ సినిమా అంటే బాగా ఇష్టం కానీ, ఈ రీమేక్ లో నటించడానికి భయపడ్డాడు.

ఎందుకంటే అంత పెద్ద క్లాసిక్ ని రీమేక్ చేస్తే కచ్చితంగా ఆ సినిమాకి మించి ఔట్పుట్ ఉండాలి, ఎమోషన్స్, డ్రామా కూడా ఒరిజినల్ వెర్షన్ ని మ్యాచ్ చేసేలా ఉండాలి, అవన్నీ మ్యాజిక్స్, అన్నీ సార్లు రిపీట్ అవ్వవు. ఈ కారణం చేతనే వెంకటేష్ ఈ చిత్రాన్ని చెయ్యడానికి ఒప్పుకోలేదట. ఒకేవేళ చేసి ఉంటే ఆయన కెరీర్ లో ఎంత పెద్ద హిట్ అయ్యి ఉండేదో అని అభిమానులు అనుకుంటున్నారు. ఎంతైనా పాపం వెంకీ బ్యాడ్ లక్ అనే అనుకోవాలి.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus