గత కొన్నేళ్లలో టాలీవుడ్ సినిమాల బడ్జెట్, టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగింది. టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం దర్శకుల విషయంలో రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడటం లేదు. తమకు హిట్టిచ్చిన డైరెక్టర్ లేదా సక్సెస్ లో స్టార్ డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడానికి టాలీవుడ్ స్టార్స్ ఆసక్తి చూపుతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తర్వాత సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది. కొరటాల శివ ఎన్టీఆర్ కు కొన్నేళ్ల క్రితం జనతా గ్యారేజ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడంతో పాటు సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
అతడు సినిమాతో సక్సెస్ ఇవ్వడంతో పాటు అరవింద సమేత, అల వైకుంఠపురములో సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ ఒక సినిమాలో నటిస్తున్నారు. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ ఖలేజా నిరాశపరిచినా ఈ సినిమా బుల్లితెరపై మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం తనకు గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ డైరెక్షన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో నటిస్తున్నారు.
చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ కాగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. బన్నీ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కిన సరైనోడు హిట్ కాగా ఈ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కనుంది. స్టార్ హీరో ప్రభాస్ సైతం సక్సెస్ లో ఉన్న స్టార్ డైరెక్టర్లకు వరుసగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం. తమకు హిట్టిచ్చిన డైరెక్టర్లు, సక్సెస్ లో ఉన్న డైరెక్టర్లు తమకు మరో సక్సెస్ ను కచ్చితంగా ఇస్తారని స్టార్ హీరోలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అయితే కొంతమంది డైరెక్టర్లకు మాత్రం హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా స్టార్ హీరోలు అవకాశాలను ఇస్తున్న సంగతి తెలిసిందే.