Tollywood: కళ్లు చెదిరే రెమ్యునరేషన్స్ తీసుకుంటున్న 6 మంది టాలీవుడ్ టాప్ హీరోలు వీళ్లే..

(Tollywood) మారుతున్న కాలంతో పాటు ఫిలిం మేకింగ్ విషయంలో లెక్కలు కూడా మారుతూ ఉంటాయి.. అవి ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు.. లో బడ్జెట్, మీడియం బడ్జెట్, భారీ బడ్జెట్ చిత్రాలనేవి అన్ని ఇండస్ట్రీల్లోనూ తెరకెక్కుతుంటాయి.. స్టార్ హీరోల సినిమాలకైతే వందల కోట్ల బడ్జెట్ పెట్టాల్సిందే.. తెలుగు సినిమా ఇప్పుడు వరల్డ్ వైడ్ అటెన్షన్ తెచ్చుకుంది.. మన టాలీవుడ్ స్టార్స్ పాన్ ఇండియా నుండి గ్లోబల్ స్టార్ ఇమేజ్ తెచ్చుకుంటున్నారు.. మన సినిమాల కోసం ప్రపంచ సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

పెరిగిన క్రేజ్ కారణంగా మేకర్స్ కూడా హీరోలకి వందలాది కోట్ల రూపాయలు పారితోషికంగా ఇవ్వడానికి వెనుకాడట్లేదు.. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో కళ్లు చెదిరే రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలెవరో చూద్దాం..

1) ప్రభాస్..

పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్టార్ ప్రభాస్ ‘సలార్’ మూవీకి అక్షరాలా రూ. 100 కోట్ల పారితోషికంతో పాటు.. లాభాల్లో (థియేట్రికల్ బిజినెస్) 10 శాతం వాటా తీసుకుంటున్నాడని.. రెండు పార్టులుగా రానుంది కాబట్టి రూ. 150 తీసుకుంటున్నాడని టాక్..

2) అల్లు అర్జున్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప : ది రూల్’ కోసం రూ. 60 కోట్లు తీసుకుంటున్నాడట.. ఇటీవల అనౌన్స్ చేసిన సందీప్ రెడ్డి వంగా పాన్ ఇండియా సినిమాకి ఏకంగా రూ. 125 కోట్లు ఇస్తున్నారని వార్తలు వైరల్ అయ్యాయి..

3) మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేష్ బాబు.. త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాకి గానూ తొలిసారిగా రూ. 100 కోట్లు అందుకుంటున్నాడట..

4) పవన్ కళ్యాణ్..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘హరి హర వీరమల్లు’ కోసం రూ. 60 కోట్లు అందుకుంటున్నారట.. అలాగే సాయి ధరమ్ తేజ్‌తో కలిసి నటిస్తున్న సినిమాకి రోజుకి రెండె కోట్ల చొప్పున తీసుకుంటున్నట్టు స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే..

5) జూనియర్ ఎన్టీఆర్..

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న (NTR 30) ఫిలింకి రూ. 60 కోట్లు తీసుకుంటున్నాడట..

6) రామ్ చరణ్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శంకర్ డైరెక్షన్‌లో చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ కోసం రూ. 60 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడట..

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus