Star Heroes: టాలీవుడ్ హీరోల లెక్కలు మారుతున్నాయా.. ఆ టార్గెట్లను సాధిస్తారా?

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శకనిర్మాతలు అవార్డులకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నారు. అవార్డులకు సంబంధించి ప్రచారం విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డ్ రావడంతో దేశవ్యాప్తంగా ఎన్టీఆర్, చరణ్, జక్కన్న పేర్లు మారుమ్రోగాయి. నేషనల్ అవార్డ్స్ కు సంబంధించి కూడా ఆర్.ఆర్.ఆర్ డామినేషన్ కనిపించింది. పుష్ప ది రైజ్ సినిమాకు బన్నీ నటనకు నేషనల్ అవార్డ్ వచ్చిన నేపథ్యంలో బన్నీ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి.

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ వల్లే తన కల నెరవేరిందని బన్నీ చెబుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోలైన మహేష్ బాబు, బన్నీ, రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, పవన్ కళ్యాణ్ ఇకపై ఆస్కార్, నేషనల్ అవార్డ్స్ విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. ఆ అవార్డులు కచ్చితంగా తమ సినిమాలకు వచ్చేలా కథల విషయంలో మరింత శ్రద్ధ పెట్టడంతో పాటు గతంతో పోల్చి చూస్తే మరింత కష్టపడనున్నారని తెలుస్తోంది.

టాలీవుడ్ స్టార్ హీరోల (Star Heroes) లెక్కలు మారుతున్నాయని తెలుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరోల టార్గెట్లు కూడా భారీ రేంజ్ లో ఉండనున్నారని సమాచారం అందుతోంది. టాలీవుడ్ స్టార్స్ సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. సలార్, దేవర, మహేష్ రాజమౌళి కాంబో మూవీ, హరిహర వీరమల్లు, ప్రాజెక్ట్ కే, గేమ్ ఛేంజర్, పుష్ప2 సినిమాలు అవార్డులు, ప్రశంసలకు అర్హత ఉన్న సినిమాలు అని ఈ సినిమాలు భవిష్యత్తు రోజుల్లో మరిన్ని అవార్డులను సొంతం చేసుకోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

ఈ సినిమాల బడ్జెట్ 2000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ కాగా ఈ సినిమాలు కలెక్షన్ల విషయంలో సైతం రికార్డులు సృష్టిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మరిన్ని భారీ మల్టీస్టారర్ల దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus