టాలీవుడ్ హీరోలందరూ పాన్ ఇండియా చిత్రాలు ప్రకటించేసారు. బాహుబలి సినిమా విజయం తరువాత సినిమాలో విషయం ఉంటే విజయానికి సరిహద్దులు అడ్డుకాదని అర్థమైంది. హీరోలో మ్యాటర్ ఉంటే నార్త్ సౌత్ అని తేడా లేకుండా ఆదరిస్తారని అవగతం అయ్యింది. దీనికి ప్రభాస్ ఇమేజే నిదర్శనం. ఆయన నటించిన సాహో సౌత్ లో ఫెయిల్ అయినా నార్త్ లో వసూళ్లు దుమ్మురేపింది. ఈ సమీకరణాల అనంతరం టాలీవుడ్ హీరోలందరూ నార్త్ ఇండియా పైకి దండ యాత్ర ప్రకటించారు. ఒక్క మహేష్ మినహా టాలీవుడ్ స్టార్ హీరోలందరూ తమ తదుపరి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్ లో పలు భాషలలో విడుదల చేయనున్నారు.
ఎన్టీఆర్, చరణ్ ల మల్టీ స్టారర్ పాన్ ఇండియా చిత్రం అని అందరికీ తెలిసిందే. రాజమౌళి కి ఇండియాలో ఉన్న ఇమేజ్ రీత్యా భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. రాజమౌళి కాబట్టి హిట్ ఖాయమని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఈ లీగ్ లో కొత్తగా చేరిన వారు అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్. బన్నీ-సుకుమార్ ల హ్యాట్రిక్ మూవీ పుష్ప పాన్ ఇండియా లెవెల్ లో ఐదు భాషలలో విడుదల కానుంది. నిజానికి చిత్ర ప్రకటన సమయంలో పుష్ప చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా విడుదల చేయాలనే ఆలోచన లేదు. అల వైకుంఠపురంలో హిట్ ప్రభావమో,మరేమి కారణమో తెలియదు కానీ పాన్ ఇండియా బరిలో దిగిపోయారు.
ఇక పవన్ కళ్యాణ్ దర్శకుడు క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా కూడా పాన్ ఇండియా మూవీగా విడుదల చేయనున్నారు. మొఘలుల ఎంఫైర్ కి సవాల్ విసిరే బందిపోటుగా పవన్ కనిపించనుండగా పాన్ ఇండియా స్టోరీ కావడంతో హిందీలో కూడా విడుదల చేస్తున్నట్లు సమాచారం. ఇక మంచు హీరోలు విష్ణు, మనోజ్ కూడా తమ లేటెస్ట్ మూవీస్ మోసగాళ్లు, అహం బ్రహ్మస్మి కూడా పాన్ ఇండియా చిత్రాలుగా విడుదల అవుతున్నాయి. మరి వీరిలో ఎవరు బాలీవుడ్ లో హిట్ తో జెండా ఎగుర వేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. హిట్టైతే ఒకే, లేదంటే కనీస వసూళ్లు కూడా దక్కవు. కాబట్టి ఎవరికి విజయమో..ఎవరికి పరాభవమో చూడాలి.