సినీ పరిశ్రమని వరుస విషాదాలు ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ దర్శకురాలు అపర్ణ మల్లాది, నిర్మాత మనో అక్కినేని,నటుడు జయశీలన్,మలయాళ దర్శకుడు షఫీ,స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ తల్లి లివి సురేష్ బాబు,సీనియర్ నటుడు విజయ రంగరాజు అలియాస్ రాజ్ కుమార్, నటుడు యోగేష్ మహాజన్, అలాగే రానా అమ్మమ్మ రాజేశ్వరి, నిర్మాత వేద రాజు టింబర్,నిర్మాత కేపీ చౌదరి, సీనియర్ నటి పుష్పలత, మలయాళ నటుడు అజిత్ విజయన్,
దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి తండ్రి, లెజెండరీ పాప్ సింగర్ రాబెర్టా ఫ్లాక్,హాలీవుడ్ సీనియర్ హీరో జీన్ హ్యాక్ మ్యాన్, జయప్రద సోదరుడు రాజబాబు,ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ,మలయాళ రచయిత మంకొంబు గోపాలకృష్ణన్, సీనియర్ నటి రజిత తల్లి, భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా వంటి వారు కన్నుమూశారు. ఈ షాకుల నుండి సినీ పరిశ్రమ ఇంకా కోలుకోకుండానే మరో విషాదం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. టాలీవుడ్ సీనియర్ నిర్మాత ముళ్ళపూడి బ్రహ్మానందం (Mullapudi Brahmanandam) మృతి చెందారు.ముళ్ళపూడి బ్రహ్మానందం వయస్సు 68 ఏళ్ళు అని తెలుస్తుంది. కొన్నాళ్ల నుండి అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన 5 రోజుల క్రితం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. మొదట్లో కోలుకున్నట్టు కనిపించినప్పటికీ.. నిన్న రాత్రి 9 గంటల టైమ్లో పరిస్థితి విషమించడంతో ఆయన మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే వారి ఫ్యామిలీలో తీవ్ర విషాదం నెలకొంది.
ఇక ముళ్ళపూడి బ్రహ్మానందం కొడుకు ఆస్ట్రేలియాలో నివసిస్తున్నారట. విషయం తెలుసుకున్న ఆయన ఇండియాకి బయలుదేరినట్టు తెలుస్తుంది. కాబట్టి.. బుధవారం నుండి అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. దివంగత స్టార్ డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణకు ముళ్ళపూడి బ్రహ్మానందం వరసకి బావ అవుతారు. ఈవీవీ సత్యనారాయణ గారి సోదరిని ముళ్ళపూడి బ్రహ్మానందం పెళ్లి చేసుకోవడం జరిగింది. ‘నేను’ ‘అల్లుడు గారు వచ్చారు’ ‘ఓ చినదాన’ ‘మనోహరం’ వంటి సినిమాలు ముళ్ళపూడి బ్రహ్మానందం నిర్మించడం జరిగింది.