మన స్టార్ హీరోల లేటెస్ట్ రెమ్యునరేషన్ డీటెయిల్స్!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో సీనియర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు. వారి సినిమాల సక్సెస్ రేట్ కూడా బాగుంది. దీంతో ఒక్కొక్కరూ తమ రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. అలా చెప్పుకుంటే దాదాపు అందరి హీరోల రెమ్యునరేషన్స్ పెరిగిపోయాయని తెలుస్తోంది. ‘గాడ్ ఫాదర్’, ‘వాల్తేర్ వీరయ్య’ సినిమాల కోసం మెగాస్టార్ చిరంజీవి రూ.50 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్నారని సమాచారం. ఒక్కో సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూ వస్తున్న రవితేజ ఇప్పుడు ‘ధమాకా’,

‘వాల్తేర్ వీరయ్య’ సినిమా సక్సెస్ లతో తన రెమ్యునరేషన్ రూ.20 కోట్లు చేశాడని టాక్. సీనియర్ హీరో బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాను ముందుగా రూ.8 కోట్లకు ఓకే చేశారు. అయితే ‘అఖండ’ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ‘వీరసింహారెడ్డి’కి రెమ్యునరేషన్ పెంచి మొత్తం రూ.12 కోట్లు తీసుకున్నారు. అనిల్ రావిపూడితో ఆయన చేయబోయే సినిమాకి రూ.14 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. ఇప్పుడు కొత్తగా ఏదైనా సినిమా ఒప్పుకోవాలంటే మాత్రం రూ.16 కోట్లు డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.

మరో హీరో వెంకటేష్ ‘ఎఫ్3’ సినిమాకి రూ.8 కోట్ల లోపు తీసుకున్నారు. ఇప్పుడు తన కొత్త సినిమాకి రూ.12 కోట్లు తీసుకుంటున్నారని సమాచారం. సీనియర్ హీరోలే ఈ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారంటే.. ఇక యంగ్ హీరోల పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. నేచురల్ స్టార్ నాని ఒక్కో సినిమాకి రూ.20 కోట్లు అడుగుతున్నారని వినిపిస్తోంది. విజయ్ దేవరకొండ రూ.25 కోట్లు అడుగుతున్నారట.

‘కార్తికేయ2’ సినిమా హిట్ తరువాత నిఖిల్ రూ.7 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. యంగ్ హీరో నాగశౌర్య రూ.4 కోట్లు, సరైన హిట్లు లేని బెల్లంకొండ శ్రీనివాస్ రూ.10 కోట్లు అడుగుతున్నారట. నాన్ థియేట్రికల్ రైట్స్ డిమాండ్ పెరగడం, ఓవర్సీస్ లో మార్కెట్ రేంజ్ పెరగడంతో హీరోలు తమ రెమ్యునరేషన్ పెంచేశారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus