బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలు హిందీలోకి డబ్ అయ్యి హిందీ యూట్యూబ్ లో సంచలన విజయాలను సొంతం చేసుకున్నాయి. అక్కడ బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలకు భారీ స్థాయిలో ఆదరణ ఉంది. అయితే హిందీ ఛత్రపతి సినిమాతో బెల్లంకొండ శ్రీనివాస్ అదృష్టాన్ని పరీక్షించుకోగా అక్కడ ఈ సినిమా దారుణమైన రిజల్ట్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమాను నిర్మించిన నిర్మాతలకు, వినాయక్ కు కూడా ఈ సినిమా భారీ షాకిచ్చింది. అయితే హిందీ ఛత్రపతి రిజల్ట్ నుంచి టాలీవుడ్ స్టార్స్ నేర్చుకోవాల్సిన పాఠం ఉంది.
పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన సినిమాలను భారీ రేంజ్ లో హిందీలో కూడా పబ్లిసిటీ చేసుకోవాల్సి ఉంది. యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన సినిమాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. నెగిటివ్ కామెంట్లకు తావివ్వకుండా స్క్రిప్ట్ విషయంలో, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో జాగ్రత్త పడాల్సి ఉంది. సరైన ప్రమోషన్స్ లేకుండా సినిమాను విడుదల చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు. రీమేక్ సినిమాలతో హిందీలో అదృష్టాన్ని పరీక్షించుకోవడం కూడా సరైన నిర్ణయం అనిపించుకోదని చెప్పవచ్చు.
ఛత్రపతి (Chatrapathi) హీరోకు ఎదురైన పరాభవం మళ్లీ రిపీట్ కాకుండా టాలీవుడ్ హీరోలు జాగ్రత్త పడాల్సి ఉంది. చాలా సంవత్సరాల కిందటి సినిమాలు రీమేక్ చేయడం కూడా సరైన నిర్ణయం అని అనిపించుకోదు. బెల్లంకొండ శ్రీనివాస్ ఇకపై బాలీవుడ్ పై దృష్టి పెడతారో లేక టాలీవుడ్ పై దృష్టి పెడతారో చూడాల్సి ఉంది.
టాలీవుడ్ హీరోలు సైతం పాన్ ఇండియాకు సూటయ్యే కథలతో తెరకెక్కిన సినిమాలను ఎంచుకుంటే కెరీర్ కు ప్లస్ అవుతుందని చెప్పవచ్చు. టాలీవుడ్ స్టార్ హీరోలు ఇకనైనా ఈ విషయంలో మారతారేమో చూడాల్సి ఉంది. టాలీవుడ్ స్టార్ హీరోలకు క్రేజ్ అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో మార్కెట్ సైతం పెరుగుతుండటం గమనార్హం.