ఈ మధ్య కాలంలో తెలుగులో రీమేక్ అయిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తున్న నేపథ్యంలో ఇతర భాషల్లో హిట్టైన సినిమాలను సైతం ప్రేక్షకులు సులువుగా చూసేస్తున్నారు. వేదాళం రీమేక్ భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు. ఈ సినిమా ఫుల్ రన్ లో భారీగా నష్టాలను మిగిల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ లో రీమేక్ లు ఆగిపోయినట్టేనని రీమేక్ సినిమాలు చేయాలంటే డైరెక్టర్లు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
రీమేక్ ల విషయంలో టాలీవుడ్ స్టార్ హీరోల నిర్ణయం మారినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్లు సైతం ఆ సాహసం చేయలేరని కొంతమంది అభిప్రాయాలను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. టాలీవుడ్ స్టార్ హీరోల రెమ్యునరేషన్లు భారీ స్థాయిలో ఉండగా రీమేక్ లలో నటించడం వల్ల సినిమాల బిజినెస్ పై ఎఫెక్ట్ పడుతోంది. భోళా శంకర్ సినిమాను మెహర్ రమేష్ కాకుండా మరొకరు తెరకెక్కించి ఉంటే రిజల్ట్ మరింత బెటర్ గా ఉండేదని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
మెహర్ రమేష్ టెక్నీషియన్ల ఎంపిక విషయంలో కూడా చాలా పొరపాట్లు చేశారు. మెహర్ రమేష్ కు ఇదే తెలుగులో చివరి సినిమా అని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మెహర్ రమేష్ రీమేక్ సినిమాలను సైతం ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడంలో ఫెయిలవుతున్నారు. మెహర్ రమేష్ గత సినిమాలు సైతం ఆశించిన ఫలితాన్ని సొంతం చేసుకోలేదు.
మెహర్ రమేష్ సినిమాలకు దూరంగా ఉంటే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రీమేక్ ల వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీ స్థాయి తగ్గిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రముఖ ప్రొడ్యూసర్లు ఇప్పటికే రీమేక్ సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!
భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!