Tollywood: టాలీవుడ్ హీరోల్లో భయం.. ఇక ఫ్యాన్స్ కు దూరంగానే..?

ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో మిగతా స్టార్స్ ను ఆలోచనలో పడేసాయి. ప్రత్యేకంగా ‘పుష్ప 2’  (Pushpa 2: The Rule) ప్రీమియర్ షో సమయంలో సంభవించిన విషాద ఘటన, అల్లు అర్జున్ (Allu Arjun) వంటి స్టార్ హీరోలకే కాదు, మొత్తం సినీ ప్రపంచానికే ఆందోళనకు గురి చేసింది. థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందడం, ఆపై మేకర్స్, పోలీసులపై వచ్చే విమర్శలు.. ఈ పరిణామాలు ప్రతి స్టార్‌ను తన భవిష్యత్తు ఇవెంట్స్ పై పునరాలోచన చేయించేలా చేస్తున్నాయి.

Tollywood

ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్స్, ప్రీమియర్ షోలు అసలు అవసరమా అనే చర్చ మొదలైంది. అభిమానుల కోసం ప్రత్యేకంగా ఈవెంట్స్ నిర్వహించడం పబ్లిసిటీ కోసం తప్ప మరేమీ కాదని కొందరు భావిస్తున్నారు. అయితే, ఈ పబ్లిసిటీ అభిమానుల జీవితాలను ప్రమాదంలోకి నెడుతున్నదా అనే ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు. ముఖ్యంగా పుష్కలమైన భద్రత ఉండకపోతే, ఇలాంటి సంఘటనలు మరింత ఆందోళనకు దారి తీసే అవకాశం ఉంది. ప్రస్తుతం హీరోలూ, దర్శకులూ ఈవెంట్స్ నిర్వహణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకునే యోచనలో ఉన్నారు.

కొంతమంది నిర్మాతలు పబ్లిక్ ఈవెంట్స్ కంటే రేంజ్ బౌండ్ ప్రైవేట్ ఈవెంట్స్ పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్ వద్ద అభిమానుల తాకిడి అదుపు తప్పడం పోలీసులకు, నిర్వాహకులకు అతికష్టం అవుతుంది. ప్రీమియర్ షోలు పెట్టకపోవడం, పబ్లిక్ ప్రీరిలీజ్ ఈవెంట్స్ వద్ద కఠిన నిబంధనలు అమలు చేయడం వంటి మార్గాలు పరిశీలనలో ఉన్నాయి. ఇదే సమయంలో, స్టార్ హీరోలు తమ ఫ్యాన్స్ తో దగ్గరగా మెలగాలని భావించినా, భద్రతా కారణాల వల్ల వారిని దూరంగా ఉంచే పరిస్థితి రానుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అభిమానులంటే కేవలం ప్రమోషన్ కోసం కాకుండా, వాళ్ల మనసుకు దగ్గరగా ఉండే వ్యక్తులు. కానీ అభిమానులని కలవడం వల్ల వచ్చే ప్రమాదాలు ఇప్పుడు హీరోల్ని వెనక్కి తీసుకుంటున్నాయి. ఈ పరిణామాలపై టాలీవుడ్ (Tollywood) ప్రముఖ నిర్మాతలు, డైరెక్టర్లు, హీరోలు కొత్త ఆలోచనలు చేస్తుండటం స్పష్టమవుతోంది. ఇకపై పెద్ద ఈవెంట్స్ నిర్వహించే ముందు భద్రతకు పెద్ద పీట వేయడం, లేదా పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్స్ పై నడుస్తారా అనేది చూడాలి. ఏదేమైనా స్టార్స్ బయటకు వస్తే కాస్త భయం భయంగా ఉండే పరిస్థితి క్రియేట్ అవుతుంది.

పుష్ప 2: హిందీలో టాప్ రికార్డుకు దగ్గరగా బన్నీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus