వెండితెర మీద కథ, కథనాలకు అనుగుణంగా ద్విపాత్రాభినయం చేసి అలరించడం అనేది కామన్.. కానీ మూడు లేదా అంతకంటే ఎక్కవ పాత్రలను ఒకే నటుడు చేయాలంటే మాత్రం అంత ఆషామాషీ విషయం కాదు.. ఎంతో కృషి, పట్టుదల ఉండాలి.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇటువంటి ప్రయోగాలకు తొలి తరం నటులే శ్రీకారం చుట్టారు. త్రిపాత్రాభినయంతో ప్రేక్షకాభిమానులను అలరించారు. అప్పటి ఎన్టీఆర్ నుండి ఇప్పటి ఆయన మనవడు నందమూరి కళ్యాణ్ రామ్ వరకు ట్రిపుల్ రోల్ చేసిన కథానాయకులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
నటరత్న ఎన్టీఆర్..
విశ్వవిఖ్యాత నట సౌర్వభౌమ నందమూరి తారక రామారావు.. ‘కుల గౌరవం’, ‘శ్రీ కృష్ణ సత్య’, ‘శ్రీమద్విరాట పర్వం’, ‘దాన వీర శూరకర్ణ’, ‘శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర చరిత్ర’ వంటి పలు చిత్రాలలో మూడు, అంతకంటే ఎక్కువ పాత్రలు పోషించి ఆకట్టుకున్నారు..
నటసామ్రాట్ ఏఎన్నార్..
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు.. టి. రామారావు దర్శకత్వం వహించిన ‘నవరాత్రి’ అనే సినిమాలో ఏకంగా 9 క్యారెక్టర్లు చేయడం విశేషం.. విభిన్న పాత్రల్లో వైవిధ్యభరితమైన నటన కనబర్చి అలరించారు ఏఎన్నార్..
సూపర్ స్టార్ కృష్ణ..
నట శేఖర, సూపర్ స్టార్ కృష్ణ.. ‘కుమార రాజా’, ‘పగబట్టిన సింహం’, ‘రక్తసంబంధం’, ‘బంగారు కాపురం’, ‘బొబ్బిలి దొర’, ‘డాక్టర్ సినీ యాక్టర్’, ‘సిరిపురం మొనగాడు’ వంటి ఏడు చిత్రాల్లో మూడు పాత్రలు పోషించారు..
నటభూషణ శోభన్ బాబు..
నటభూషణ శోభన్ బాబు.. ‘ముగ్గురు మొనగాళ్లు’ అనే మూవీలో ట్రిపుల్ రోల్ చేశారు.. తమిళంలో సూపర్ స్టార్ రజినీ కాంత్ నటించిన ‘మూండ్రు ముగమ్’ సినిమాకిది తెలుగు రీమేక్..
మెగాస్టార్ చిరంజీవి..
మెగాస్టార్ చిరంజీవి ‘ముగ్గురు మొనగాళ్లు’ లో మూడు పాత్రలు వేశారు. లారీ డ్రైవర్, పోలీస్ ఆఫీసర్, క్లాసికల్ డ్యాన్సర్.. ఇలా ముచ్చటగా మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసి ప్రేక్షకాభిమానులను ఆకట్టుకున్నారు..
నటసింహ నందమూరి బాలకృష్ణ..
నటసింహ నందమూరి బాలకృష్ణ ‘అధినాయకుడు’ అనే ఫిలింలో మూడు రోల్స్ ప్లే చేశారు.. తాత, తండ్రి మరియు మనవడిగా వేరియేషన్స్ చూపించారు..
కింగ్ నాగార్జున..
అక్కినేని నటవారసుడు కింగ్ నాగార్జున సినిమాల్లో త్రిపాత్రాభినయం చేయలేదు కానీ హోస్ట్ చేసిన ‘బిగ్ బాస్’ రియాలిటో షో యాడ్ కోసం ఒకేసారి మూడు పాత్రల్లో కనిపించి సందడి చేశారు..
యంగ్ టైగర్ ఎన్టీఆర్..
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఈ నందమూరి థర్డ్ జెనరేషన్ హీరో, ఆల్ రౌండర్ ‘జై లవ కుశ’ చిత్రంలో వైవిధ్యభరితమైన ట్రిపుల్ రోల్ చేశాడు.. దొంగ, బ్యాంక్ ఉద్యోగి, రావణ్ అనే అన్నదమ్ముళ్ళ పాత్రలకు తన నటనతో ప్రాణం పోశాడు.. రావణ క్యారెక్టర్‌లో నత్తిగా మాట్లాడి అలరించాడు..
నందమూరి కళ్యాణ్ రామ్..
తమ్ముడు తారక్ తర్వాత అన్నయ్య, టాలెంటెడ్ యాక్టర్ నందమూరి కళ్యాణ్ రామ్ కూడా మూడు పాత్రలు పోషించాడు.. ‘అమిగోస్’ మూవీలో సరికొత్త గెటప్స్, డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నాడు..
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!