సినిమా విజయంలో కథ కీలకం. హిట్ అయ్యే కథను ఎంచుకోవడంలోనే విజయ రహస్యం దాగుంది. స్టోరీల విషయాల్లో హీరోలు తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు రాంగ్ అవుతుంటాయి. ఫెయిల్ అవుతాయి అని అనుకున్న కథలు బ్లాక్ బస్టర్ అయి పశ్చాత్తాపపడేలా చేస్తాయి. అటువంటి సినిమాలపై ఫోకస్..
ఎన్టీఆర్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వద్దన్న అనేక కథలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ జాబితాలో దిల్, ఆర్య, అతన్నొక్కడే, కృష్ణ, భద్ర, కిక్, శ్రీమంతుడు, ఊపిరి ఉన్నాయి. భద్ర కథను వదులుకున్నందుకు బాధపడినట్లు తారక్ ఓ సందర్భంలో చెప్పారు.
పవన్ కళ్యాణ్ రొటీన్ కథలనే చేయడానికి ఇష్టంలేక పవన్ కళ్యాణ్ ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి కథలను పక్కన పెట్టారు. అతడు, పోకిరి, మిరపకాయ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కథలు కూడా మొదట పవన్ వద్దకే వచ్చాయి, కానీ చేయనున్నారు. అయితే “అతడు” మూవీని ఎందుకు చేయలేకపోయానని పవన్ పశ్చాత్తాపపడ్డారు.
మహేష్ బాబు పాత్రలు తన బాడీ ల్యాంగ్వేజ్ కి సూట్ కావని మహేష్ బాబు అద్భుతమైన కథలను చేయనున్నారు. అందులో మొదటిది ఏ మాయ చేసావే. రెండోది “24 “. అలాగే రుద్రమదేవిలో గోన గంగా రెడ్డి పాత్రను కూడా ప్రిన్స్ తిరస్కరించారు. వాటిని వదులుకున్నందుకు ఆయన ఎప్పుడూ బాధపడలేదు.
సూర్య పూరి జగన్నాథ్ “బిజినెస్ మ్యాన్” కథను మొదట తమిళ హీరో సూర్యకు చెప్పారు. ఆయన చేయనున్నారు. అలాగే రాజమౌళి చెప్పిన కథను కూడా రిజెక్ట్ చేశారు. తర్వాత దర్శకధీరుడితో కలిసి పనిచేసే అవకాశాన్ని వదులుకున్నందుకు తాను బాధపడినట్లు సూర్య విలేకరుల సమావేశంలో చెప్పారు.
రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వదులుకున్న కథలు హిట్ అయిన సినిమాలు కూడా రెండు ఉన్నాయి. అవి ఏటో వెళ్లిపోయింది మనసు, ఒకే బంగారం. అటు అవార్డుల పరంగా, ఇటు కలక్షన్ల పరంగా ఈ సినిమాలు విజయవంతమై చెర్రీకి పాఠాలు చెప్పాయి.
ప్రభాస్ ఎన్టీఆర్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ అయిన సింహాద్రి కథ మొదట ప్రభాస్ కి వినిపించారు రాజమౌళి. ఆ కథను దర్శకధీరుడు హ్యాండిల్ చేయలేరని భావించి డార్లింగ్ చేయనన్నారు. సింహాద్రి చూసి తర్వాత జక్కన్న టాలెంట్ చూసి ఆశ్చర్యపోయి అభినందించారు. వెంటనే అతనితో ఛత్రపతి చేశారు.
అల్లు అర్జున్ మొదటి నుంచి చివరి వరకు సరదాగా సాగిపోయే “పండుగ చేస్కో” సినిమా కథ మొదట అల్లు అర్జున్ వద్దకు వచ్చింది. ఆ కథకు బన్నీ ఇంప్రెస్స్ కాలేక వదిలేశారు. తర్వాత ఆచిత్రం సాధించిన కలక్షన్ చూసి ఔరా అని అనుకున్నారు.
మంచు మనోజ్ రామ్ చరణ్ చేసిన రచ్చ సినిమా కథను మంచు మనోజ్ రిజెక్ట్ చేశారు. కారణం తెలియదు కానీ తన కెరీర్ లో ఓ హిట్ ని వదులుకున్నారు.