ఒక్కప్పుడు స్టార్ హీరోల ఫ్యాన్స్.. ‘మా హీరో సినిమా ఎక్కువ రోజులు ఆడింది’ అని పోటీ పడే వారు.. అటు తరువాత ‘మా హీరో సినిమా ఎక్కువ సెంటర్లో ఆడింది’ అని ‘ఇప్పుడైతే ఎక్కువ కలెక్షన్స్’ అంటూ గొడవలు పడుతున్నారు. ఇక సోషల్ మీడియా ఊపందుకున్నాక ‘టీజర్’ లైక్స్, వ్యూస్… తరువాత ‘ట్రైలర్’ లైక్స్ అండ్ వ్యూస్… అంటూ పోటీ పడేవారు. ఇప్పుడైతే టి.ఆర్.పి రేటింగ్ లు అలాగే.. ఆల్ టైం రికార్డులు క్రియేట్ చేసిన స్టార్ హీరోల సినిమాలు.. అలాగే బర్త్ డే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ లతో పోటీ పడుతున్నారు. ప్రతీ ఏడాది ఈ పోటీ జరుగుతూనే ఉంది. ముందు వచ్చిన స్టార్ హీరో బర్త్ డే ట్యాగ్ రికార్డుని తర్వాత వచ్చే స్టార్ హీరో బర్త్ డే రోజున బ్రేక్ అవుతూ వస్తుంది.
మొదటగా అల్లు అర్జున్, ఎన్టీఆర్ బర్త్ డే లు ముందుగా వస్తాయి కాబట్టి.. వాళ్ళ ఫ్యాన్స్ క్రియేట్ చేసిన రికార్డులను మహేష్, పవన్ ఫ్యాన్స్ బ్రేక్ చేస్తుంటారు. అటు తరువాత ప్రభాస్ ఫ్యాన్స్ అప్పటి వరకూ ఉన్న రికార్డులను బ్రేక్ చెయ్యడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏకంగా #HappyBirthDayNTR 21.5 మిలియన్ ట్వీట్స్ వేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఇప్పటి వరకూ ఇదే హైయెస్ట్ అని చెప్పాలి. లాక్ డౌన్ వల్ల ఫ్యాన్స్ అందరూ ఇళ్ళల్లోన్నే ఉండడంతో ఈ ఫీట్ సాధ్యమైందని చెప్పొచ్చు. మరి లాక్ డౌన్ తరువాత ఈ రికార్డులను మిగిలిన స్టార్ హీరోల ఫ్యాన్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంటుందా అనేది ప్రస్తుతానికి డౌట్ అనే చెప్పాలి. ఇక టాప్ 10 బర్త్ డే ట్రెండ్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
1) #HappyBirthDayNTR(2020) : 21.5 మిలియన్ ట్వీట్స్
2) #HappyBirthdayPawanKalyan(2019) : 10.51 మిలియన్ ట్వీట్స్
3) #HappyBirthdaySSMB(2019) : 8.3 మిలియన్ ట్వీట్స్
4) #HBDJanaSenaniPawankalyan(2018) : 7.4 మిలియన్ ట్వీట్స్
5) #HBDSuperstarMAHESH(2018) : 4.5 మిలియన్ ట్వీట్స్
6) #HBDSuperstarPrabhas (2018) : 4.2 మిలియన్ ట్వీట్స్
7) #HBDLeaderPawanKalyan(2017) : 2.9 మిలియన్ ట్వీట్స్
8) #HappyBirthdayAlluArjun(2020) : 2.4 మిలియన్ ట్వీట్స్
9) #HappyBirthdayNTR(2018) : 2.2 మిలియన్ ట్వీట్స్
10) #DBDDarlingPrabhas(2017) : 2.1 మిలియన్ ట్వీట్స్