ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు కరోనా బారిన పడ్డారు. కొందరు కోలుకోగా.. మరికొందరు మృత్యువాత పడ్డారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం లాంటి దిగ్గజాన్ని కోల్పోయేలా చేసింది కరోనా. ఇప్పుడు మరో సినీ ప్రముఖుడు కరోనాకు బలైపోయారు. వర్ధమాన కథా రచయితే కొండవీటి వంశీ రాజేష్ కరోనాతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న వంశీ ఈరోజు సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ విషాయాన్ని దర్శకుడు శ్రీనువైట్ల ఖరారు చేశారు. ట్విట్టర్ ద్వారా స్పందించిన వైట్ల..
రాజేష్ మృతిని నమ్మలేకపోతున్నానని అన్నారు. ఈ వార్త విని షాక్ అయ్యానని.. చాలా బాధగా ఉందని అన్నారు. తన జీవితంలో రాజేష్ ని మర్చిపోవడం జరగదని.. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. శ్రీనువైట్ల రూపొందించిన చిత్రాలలో స్టోరీ రైటింగ్ విభాగంలో రాజేష్ పని చేశారు. 2017లో వచ్చిన ‘మిస్టర్’ సినిమాకి రచనా విభాగంలో పని చేసిన ఈయన.. ఆ తరువాత ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ సినిమాకి కథ అందించారు.
తొలిసారి పూర్తిస్థాయి కథా రచయితగా ఈ సినిమాకి పని చేశారు. ఆయన చివరిగా ‘శబ్దం’ సినిమాకి పని చేశారు. రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వలన విడుదలకు నోచుకోలేదు.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!