ఒక్కో నెలలో ఒక్కో హీరో.. టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్స్ ప్లాన్ ఇదే!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉన్న హీరోలలో పవన్ కళ్యాణ్, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ముందువరసలో ఉంటారు. ఈ ఆరుగురు హీరోలకు ఇతర భాషల్లో సైతం గుర్తింపు ఉండగా ఈ హీరోలకు క్రేజ్, మార్కెట్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతకంతకూ పెరుగుతోంది. గతంలో ఈ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. అయితే 2024 సంవత్సరంలో మాత్రం ఈ హీరోలు తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఒక్కో నెలలో ఒక్కో హీరో సినిమా రిలీజయ్యే విధంగా ఆయా సినిమాల నిర్మాతలు ప్లాన్ చేసుకుంటున్నారు. యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలలో మెజారిటీ సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కుతున్నాయి. మహేష్ నటించిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి, మార్చి నెలలలో యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలేవీ విడుదల కావడం లేదు.

ఏప్రిల్ నెలలో దేవర (Devara) రిలీజ్ కానుండగా మే నెలలో కల్కి 2898 ఏడీ సినిమా విడుదల కానుంది. ఆగష్టు నెలలో పుష్ప ది రూల్ రిలీజ్ కానుండగా సెప్టెంబర్ నెలలో గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కానుంది. అక్టోబర్ నెలలో ఓజీ మూవీ రిలీజ్ కానుందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం. ప్రభాస్ మారుతి కాంబో మూవీ మాత్రం రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోవాల్సి ఉంది.

యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలు ఇలా వేర్వేరు సమయాలలో రిలీజ్ కావడం వల్ల కలెక్షన్ల పరంగా కూడా ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. స్టార్ హీరోలు రాబోయే రోజుల్లో కూడా తమ సినిమాలను ఇదే విధంగా ప్లాన్ చేసుకునే అవకాశం అయితే ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!

హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus