రాబోయే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా రాబోతున్నాయి. దీంతో ఎవరికెన్ని థియేటర్లు దొరుకుతాయా..? అనే టెన్షన్ అభిమానుల్లో కలుగుతోంది. నాలుగైదు హాళ్లు మాత్రమే ఉండే కొన్ని బీసీ సెంటర్స్ లో సంక్రాంతి సినిమాలకు థియేటర్లు కేటాయించడంతో పెద్ద తలనొప్పిగా మారింది. ‘వాల్తేర్ వీరయ్య’, ‘వీరసింహారెడ్డి’లకు వచ్చే ఓవర్ ఫ్లోస్ ని మిగిలిన సినిమాలు క్యాష్ చేసుకోవాలనుకున్నా.. ముందు ఆ రెండు సినిమాలకు పాజిటివ్ టాక్ రావాలి.
ఎంత సంక్రాంతి సీజన్ అయినా.. ఆ హడావిడి సందడి కేవలం వారం రోజులు మాత్రమే ఉంటుంది. అంతలోపే కలెక్షన్స్ ను రాబట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఉన్న సినిమాలు చాలవన్నట్లు సంతోష్ శోభన్ నటించిన ‘కళ్యాణం కమనీయం’ సినిమాను కూడా అదే సమయంలో రిలీజ్ చేయాలని నిర్మాత సంస్థ యూవీ క్రియేషన్స్ నిర్ణయించుకుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కొత్త దర్శకుడు అనిల్ రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.
అసలు షూటింగ్ ఎక్కడి వరకు వచ్చిందో మీడియాకు తెలియనంత సైలెంట్ గా పూర్తి చేస్తున్నారు. ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా కూడా సంక్రాంతికే వస్తానని పట్టుబడితే మాత్రం థియేటర్లు సర్దుబాటు చేయడం అంత ఈజీకాదు. యూవీ వాళ్లకు డిస్ట్రిబ్యషన్ లో కాస్త పట్టు ఉంది. వారి ఆధ్వర్యంలో నడిచే కొన్ని మల్టీప్లెక్స్ లు ఉన్నాయి. అయినప్పటికీ.. సంక్రాంతికి రిలీజ్ చేయాలనే రిస్కీ డెసిషన్ తీసుకోవడం అవసరమా..?
అనే ఆభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొన్నిరోజుల క్రితం ఇలానే రెండు పెద్ద సినిమాల మధ్య విడుదలైన ‘స్వాతిముత్యం’ సినిమా నలిగిపోయింది. సినిమాకి పాజిటివ్ టాక్ ఉన్నా.. కలెక్షన్స్ మాత్రం లేవు. ఇప్పుడు ‘కళ్యాణం కమనీయం’ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తే అదే పరిస్థితి ఎదురయ్యే ఛాన్స్ ఉంది. మరేం చేస్తారో చూడాలి!
హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!