ఈ ఫొటోలో మహేష్ తో ఉన్న ఈ చిన్నపిల్లాడు ఇప్పుడు ఓ క్రేజీ హీరో.. ఎవరో గుర్తుపట్టండి చూద్దాం

అప్పట్లో చైల్డ్ ఆర్టిస్ట్ లుగా చేసిన నటీనటులు ఇప్పుడు హీరోలు/ హీరోయిన్లు.. గా చేస్తున్న సంగతి తెలిసిందే.వీరిలో కొంతమంది సక్సెస్ అయ్యారు. ఇంకొంతమంది సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు.అయితే ఫిజికల్ అప్పీరెన్స్ పరంగా చూసుకుంటే అప్పటికీ ఇప్పటికీ వీరిలో చాలా మార్పు వచ్చింది. పెద్దయ్యాక వీళ్లను చూస్తే కనీసం గుర్తుపట్టలేము అని చెప్పొచ్చు. ఇక ఈ ఫొటోలో కనిపిస్తున్న చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడో క్రేజీ హీరో తెలుసా? ఆల్రెడీ రెండు సినిమాల్లో నటించాడు.

ఓ సూపర్ హిట్ ను అందుకున్నాడు. అతను ఓ సీనియర్ హీరో కొడుకు కూడా.! ఈ పాటికి చాలా మంది గుర్తుపట్టేసి ఉంటారు. ఎస్ అతనే రోషన్. శ్రీకాంత్ గారి పెద్దబ్బాయి. రోషన్ చిన్నప్పుడు మహేష్ తో కలిసి దిగిన ఫోటో ఇది. రోషన్ ఇప్పటి లుక్ కు .. ఈ ఫోటోలో ఉన్న లుక్ కు అస్సలు సంబంధం లేదు. ఇప్పుడు అతను మహేష్ బాబు అంత హైట్ అయిపోయాడు.

అలాగే చాలా గ్లామర్ వచ్చాడు. ‘పెళ్ళిసందD’ ట్రైలర్ ను లాంచ్ చేసింది మహేష్ బాబే అన్న సంగతి తెలిసిందే. ఆ టైంలో రోషన్- మహేష్ లు తీసుకున్న ఫోటోని అలాగే మహేష్ తో రోషన్ దిగిన చిన్నప్పటి ఫోటోని షేర్ చేసి నెటిజన్లు వైరల్ చేస్తున్నారు.రోషన్ చిన్నప్పటి ఫోటో ‘అర్జున్’ టైంలో తీసుకున్నది. అంటే 18 ఏళ్ళ క్రితం ఫోటో అన్న మాట. అయితే అప్పటికీ ఇప్పటికీ మహేష్ ఒకేలా ఉండటం.. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా గ్లామర్ గా ఉండడాన్ని మనం గమనించవచ్చు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus