మారుతీ హీరో తండ్రి కరోనాతో మృతి..!

ఇప్పుడు కరోనా దేశవ్యాప్తంగా విస్తరిస్తూనే ఉంది.మార్చి నెలలో లాక్ డౌన్ ఏర్పాటు చేసి రెండు నెలలు పైనే దానిని కొనసాగించారు. తరువాత విడతల వారీగా అన్-లాక్ చేయడంతో.. ఇప్పుడు జనాలు రోడ్ల పైనే తిరిగేస్తున్నారు. రెండు నెలలు లాక్ డౌన్ టైంలో నమోదు అయిన కేసులు.. ఇప్పుడు ఒక్క రోజులో నమోదవుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు కలిగి ఉన్న దేశంగా ఇప్పుడు మన ఇండియా 3వ స్థానంలోకి వచ్చేసింది అంటే ఎంత డేంజర్ సిట్యుయేషన్ లో మనం ఉన్నామో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

ఇప్పుడు సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ తో సహా పలువురు బుల్లితెర నటులకి కరోనా సోకింది. ఇక పోకూరి రామారావు వంటి నిర్మాత కూడా కరోనా కాటుకి బలైపోయాడు. తాజాగా మరో హీరో తండ్రి కూడా కరోనా కారణంగా మరణించినట్టు తెలుస్తుంది. మారుతీ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఈరోజుల్లో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో శ్రీనివాస్ మంగం అందరికీ గుర్తుండే ఉంటాడు. తరువాత ఇతను ‘లవ్ సైకిల్’ ‘పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్’ వంటి చిత్రాల్లో కూడా నటించాడు.

ఇతని తండ్రి దుర్గా ప్రసాద్ ఇటీవల కరోనా మరణించినట్టు తెలుస్తుంది. 20 రోజుల క్రితం దుర్గా ప్రసాద్ అనారోగ్యంతో బాధపడుతున్న రీత్యా.. విజయవాడ లోని ఆసుపత్రిలో జాయిన్ చెయ్యగా.. డాక్టర్లు ఇతనికి కరోనా టెస్టులు చేశారట. దాంట్లో ఇతనికి కరోనా పాజిటివ్ తేలడంతో.. హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ ఇప్పించారట కుటుంబ సభ్యులు. ఈ క్రమంలో దుర్గా ప్రసాద్ కు.. శ్వాస పీల్చుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది తలెత్తడంతో మరణించినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus