మరో 40 రోజుల్లో థియేటర్లలో ఆర్ఆర్ఆర్ మూవీ రిలీజ్ కానుంది. 500 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దేశవ్యాప్తంగా 10,000కు పైగా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం. ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ అయ్యే విధంగా రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. అజయ్ దేవగణ్, అలియా భట్ నటించడంతో బాలీవుడ్ లో కూడా ఆర్ఆర్ఆర్ కు రికార్డు స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ తో కొత్త రికార్డులు క్రియేట్ చేయాలని రాజమౌళి ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజైన పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా ప్రేక్షకుల అంచనాలను పూర్తిస్థాయిలో అందుకోలేదు. ఈ సినిమా నుంచి మరికొన్ని పాటలు రిలీజ్ కావాల్సి ఉంది. ఆర్ఆర్ఆర్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ దేశభక్తి కథాంశంతో తెరకెక్కుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై భారీస్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా మేకర్స్ తెలుగు రాష్ట్రాల సీఎంలను పన్ను మినహాయింపు కోరతారా? అనే చర్చ జరుగుతోంది.
హీరో నిఖిల్ సైతం ఆర్ఆర్ఆర్ కు పన్ను మినహాయింపు ఇస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో అభిప్రాయపడ్డారు. అయితే ఆర్ఆర్ఆర్ లో కమర్షియల్ అంశాలు కూడా ఉన్నాయి. రాజమౌళి షాకింగ్ ట్విస్టులతో ఈ సినిమాను తెరకెక్కించారని సమాచారం. ఆర్ఆర్ఆర్ రిజల్ట్ విషయంలో రాజమౌళి ఏ మాత్రం టెన్షన్ లేకుండా ఉన్నారని తెలుస్తోంది. డీవీవీ దానయ్యకు ఈ సినిమా ద్వారా వందల కోట్ల రూపాయల లాభం వచ్చిందని సమాచారం.