వరుస ఫ్లాపులతో ఢీలా పడిన తెలుగు హీరోలు వీళ్లే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోలు వరుస విజయాలతో దూసుకెళుతుంటే మరి కొంతమంది హీరోలు మాత్రం సక్సెస్ కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. టాలెంట్ పుష్కలంగా ఉండి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోలలో సుమంత్, ఆది సాయికుమార్, సందీప్ కిషన్, శ్రీవిష్ణు, మంచు విష్ణు, రాజ్ తరుణ్ ముందువరసలో ఉన్నారు. ఈ మధ్య కాలంలో ఈ ఆరుగురు హీరోల సినిమాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. సినిమాసినిమాకు గ్యాప్ తీసుకుంటున్న సుమంత్ హీరోగా నటించిన కపటధారి సినిమా గత నెలలో విడుదలై ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే.

క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన కపటధారి ఇతర భాషల్లో హిట్టైనా తెలుగులో మాత్రం హిట్ కాలేదు. ప్రస్తుతం సుమంత్ వాల్తేరు శీను అనే సినిమాలో నటిస్తూ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న శ్రీ విష్ణు కీలక పాత్రలో నటించిన గాలి సంపత్ ఈ నెల 11న విడుదలై ఫ్లాప్ గా నిలిచింది. గాలిసంపత్ సినిమా విడుదలైన వారానికే ఓటీటీలో స్ట్రీమింగ్ కావడం గమనార్హం. చేతిలో సినిమాలు ఉన్నా శ్రీవిష్ణుకు సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఆది సాయికుమార్ కెరీర్ తొలినాళ్లలో నటించిన ప్రేమకావాలి, లవ్ లీ సినిమాలు హిట్ కాగా ఈ రెండు సినిమాల తరువాత ఆది నటించిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతోంది.

మార్చి 19న విడుదలైన శశి సినిమా కూడా ఫ్లాప్ కావడంతో ఆది కెరీర్ లో మరో ఫ్లాప్ చేరింది. ప్రస్తుతం ఆది సాయికుమార్ చేతిలో రెండు సినిమాలు ఉన్నట్టు తెలుస్తోంది. బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురు చూస్తున్న మంచు విష్ణుకు మోసగాళ్లు సినిమాతో భారీ షాక్ తగిలింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, సునీల్ శెట్టి నటించినప్పటికీ మంచి విష్ణుకు మాత్రం మరో ఫ్లాప్ తప్పలేదు. ఢీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న్ డబుల్ డోస్ సినిమాపైనే మంచు విష్ణు ఆశలు పెట్టుకున్నారు.

విలక్షణ కథలను ఎంచుకుంటున్న సందీప్ కిషన్ వరుస ఫ్లాపుల వల్ల కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు. కెరీర్ తొలినాళ్లలో హ్యాట్రిక్ విజయాలను సొంతం చేసుకున్న రాజ్ తరుణ్ సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ హీరో స్టాండప్ రాహుల్ తో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తుండగా ఈ సినిమాలైనా రాజ్ తరుణ్ కు సక్సెస్ ను తెచ్చిపెడతాయేమో చూడాల్సి ఉంది.

1. కపటధారి

2.గాలిసంపత్

3.శశి

4.మోసగాళ్లు

5.ఎ1 ఎక్స్ ప్రెస్

6.పవర్ ప్లే

Most Recommended Video

రంగ్ దే సినిమా రివ్యూ & రేటింగ్!
అరణ్య సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus