నటసింహ నందమూరి బాలకృష్ణ, యంగ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్‌లో.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఔట్ అండ్ ఔట్ యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్.. ‘వీర సింహా రెడ్డి’.. ఫస్ట్ టైం శృతి హాసన్, బాలయ్యకి జోడీగా నటిస్తోంది. లాల్, ‘దునియా’ విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, హనీ రోజు కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. సంక్రాంతికి సినిమాని బాక్సాఫీస్ బరిలో దింపడానికి ఫుల్ జోష్‌తో పనిచేస్తోంది మూవీ టీం. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీస్థాయిలో జరిగింది.
నవంబర్ 25 ఉదయం ‘వీర సింహా రెడ్డి’ నుండి ఫస్ట్ సింగిల్ వదులుతున్నామని అనౌన్స్ చేసింది యూనిట్. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ‘వీర సింహా రెడ్డి’ లో ఇంతకుముందు సీమ సినిమాల్లో చూడని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయట. బాలయ్య పోరాటాలు, థమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ థియేటర్లలో ఫ్యాన్స్, ఆడియన్స్‌కి గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు. నటసింహ చేస్తున్న రెండు క్యారెక్టర్లకీ సాలిడ్ ఫైట్స్ పెట్టారని సమాచారం.
సాధారణంగా బాలయ్య బాబు సినిమాలంటే యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యం ఉంటుంది.. అందులోనూ సీమ బ్యాక్ డ్రాప్ అయితే ఇక చెప్పక్కర్లేదు.. ప్రత్యర్థులతో పోరాడడానికి వాడే ఆయుధాలు కూడా విభిన్నంగా ఉండాలి.. కత్తులు, గొడ్డళ్లు, వేట కొడవళ్లు లాంటి వాటితో పాటు బాంబులు కూడా బీభత్సంగా ఉంటాయి. ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహ నాయుడు’, ‘చెన్నకేశవ రెడ్డి’ సినిమాల్లో యాక్షన్ ఎపిసోడ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో తెలిసిందే.
ఫ్యాన్ బాయ్ అయిన గోపిచంద్ వాటిని మించిపోయేలా ఇందులో ఫైట్స్ డిజైన్ చేశాడట. స్టంట్ మాస్టర్స్ రామ్ – లక్ష్మణ్ రోమాలు నిక్కబొడుచుకునే రేంజ్‌లో ఫైట్స్ కంపోజ్ చేశారట. అవి ఎలా ఉండబోతున్నాయో ఫస్ట్ హంట్ టీజర్‌లో శాంపిల్ చూపించారు. ‘వీర సింహా రెడ్డి’ లో చిన్నవి, పెద్దవి మొత్తం కలిపి ఏకంగా 11 ఫైట్స్ ఉన్నాయనే న్యూస్ ఫిలిం వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 2023 సంక్రాంతి బరిలో దిగబోతుందీ చిత్రం..