ఇప్పట్లో ఓ సినిమాకి బిజినెస్ జరగడం అనేది బాగా కష్టమైపోయింది. ఎందుకంటే ఒకప్పటిలా ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప.. వీకెండ్ తర్వాత థియేటర్లకి జనాలు రావడం లేదు. అందువల్ల డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు.. కూడా ఓ సినిమా పంపిణీ హక్కులు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆ సినిమాకి ఎంత బడ్జెట్ అయ్యింది, దానిపై ఎంత బజ్ ఉంది వంటి వివరాలు చెక్ చేసుకుని కానీ తీసుకోవడం లేదు. సరే ఆ విషయాలు పక్కన పెట్టేసి ఇప్పటివరకు టాలీవుడ్ సినిమాల్లో.. హయ్యెస్ట్ థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఆర్.ఆర్.ఆర్ :
రాజమౌళి -రాంచరణ్- ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాకి ఏకంగా రూ.492 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పటికీ దీని రికార్డుని మరో సినిమా బ్రేక్ చేయలేదు. అయితే ఫుల్ రన్లో ఈ సినిమా రూ.608.65 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.116 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే జపాన్ కలెక్షన్స్ కలపకుండానే అంత షేర్ ను రాబట్టింది.
2) కల్కి 2898 AD :
ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాకి ఏకంగా రూ.381 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. మరి జూన్ 27 న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.
3) బాహుబలి 2 :
రాజమౌళి -ప్రభాస్ కాంబినేషన్లో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాకి ఏకంగా రూ.350 కోట్లు వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఏకంగా 814.10 కోట్ల షేర్ ను రాబట్టింది. రూ.464.10 కోట్ల లాభాలతో ఈ సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రికార్డులను ఇప్పటి వరకు ఏ టాలీవుడ్ మూవీ బ్రేక్ చేయలేదు అనే చెప్పాలి.
4) సలార్ :
ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందిన ‘సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్’ పాన్ ఇండియా మూవీ రూ.336.9 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది.ఫైనల్ గా ఈ సినిమా రూ.326.05 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా రూ.11.95 కోట్ల నష్టాలతో ఈ సినిమా అబౌవ్ యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది.
5) సాహో :
ప్రభాస్ – సుజీత్ కాంబినేషన్లో రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీకి ఏకంగా రూ.290 కోట్లు వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్ గా ఈ సినిమా రూ.232.60 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో రూ.58 కోట్ల నష్టాలతో యావరేజ్ ఫలితంతో సరిపెట్టుకుంది ఈ మూవీ.
6) ఆదిపురుష్ :
ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో ‘రామాయణం’ ఆధారంగా రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాకు రూ.228.9 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్ గా ఈ సినిమా రూ.196.58 కోట్ల షేర్ ను రాబట్టి, రూ.33 కోట్ల నష్టాలతో అట్టర్ ప్లాప్ గా మిగిలింది.
7) సైరా నరసింహారెడ్డి :
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమాకి వరల్డ్ వైడ్ గా రూ.200 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్ గా రూ.132.85 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. రూ.67 కోట్ల నష్టాలతో కమర్షియల్ ఫెయిల్యూర్ మూవీగా నిలిచింది.
8) రాధే శ్యామ్ :
ప్రభాస్ హీరోగా ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పాన్ ఇండియా మూవీకి రూ.196.3 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్ గా రూ.86.41 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టి.. రూ.113 కోట్ల భారీ నష్టాలతో ఎపిక్ డిజాస్టర్ గా మిగిలింది.
9) పుష్ప :
అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్లో హ్యాట్రిక్ మూవీగా రూపొందిన ఈ పాన్ ఇండియా మూవీకి రూ.145.5 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫైనల్ గా ఈ సినిమా రూ.165.15 కోట్ల షేర్ ను రాబట్టి.. రూ.19 కోట్ల లాభాలతో సూపర్ హిట్ గా నిలిచింది.
10) ఆచార్య :
మెగాస్టార్ చిరంజీవి -కొరటాల శివ- రాంచరణ్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రానికి రూ.133.2 కోట్ల వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇది రీజనల్ మూవీ అయినప్పటికీ అంత మొత్తం ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది రాంచరణ్ వల్లే అని చెప్పాలి. ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత చరణ్ నటించిన సినిమా కావడంతో హైప్ కూడా పెరిగింది. కానీ సినిమాకి ప్లాప్ టాక్ రావడంతో ఫైనల్ గా రూ.46.07 కోట్ల షేర్ మాత్రమే నమోదైంది. రూ.87 కోట్ల నష్టాలు మిగిల్చి ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది.