Nizam Movies: ‘దసరా’ తో పాటు నైజాంలో భారీ వసూళ్లు రాబట్టిన మిడ్ రేంజ్ సినిమాల లిస్ట్!

  • May 6, 2023 / 02:33 PM IST

స్టార్ హీరోలే కాదు ‘టైర్ 2’ హీరోలు.. అంటే మీడియం రేంజ్ హీరోలు కూడా తమ సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సందర్భాలు చూస్తూనే ఉన్నాం. వీళ్ళ సినిమాలు కూడా ఓపెనింగ్ డే అసాధారణమైన కలెక్షన్స్ సాధిస్తున్నాయి.స్టార్ డైరెక్టర్లతో.. అలాగే స్టార్ ప్రొడ్యూసర్లతో సినిమాలు చెయ్యకపోయినా .. మొదటి రోజు వీళ్ళ సినిమాలకి కూడా మంచి కలెక్షన్లు వస్తుండటం అంటే చిన్న విషయం ఏమీ కాదు. వీళ్ళ సినిమాలకు ఉండే డిమాండ్ కూడా అలాంటిది. ఒకవేళ సినిమాకి భారీ హైప్ ఏర్పడిందంటే చాలు బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాలతో సమానంగా ఓపెనింగ్స్ రాబట్టడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. లేటెస్ట్ గా వచ్చిన నాని ‘దసరా’ సినిమాకి అలాంటి అద్భుతమే జరిగింది.

ఈ సినిమా ఒక్క నైజాంలోనే రూ.25 కోట్లు(షేర్) ను వసూల్ చేసింది. ఒకవేళ స్టార్ డైరెక్టర్స్ అలాగే స్టార్ ప్రొడ్యూసర్లతో కనుక వీళ్ళు సినిమాలు చేస్తే .. రిజల్ట్ ఏ రేంజ్లో ఉంటుందో చెప్పనవసరం లేదు.ఏడాదికి రెండు, మూడు సినిమాలు చేసి సినీ కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది ఈ టైర్ 2 హీరోలే. నాని , విజయ్ దేవరకొండ, వరుణ్ తేజ్, నితిన్,.. అబ్బో ఈ లిస్ట్ కొంచెం పెద్దదే. మరి (Nizam Movies) నైజాంలో హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన మిడ్ రేంజ్ హీరోల సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) దసరా :

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఒక్క నైజాంలోనే రూ.25 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి నెంబర్ 1 మూవీగా నిలిచింది.

2) గీత గోవిందం :

విజయ్ దేవరకొండ హీరోగా పరశురామ్ పెట్ల(బుజ్జి) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నైజాంలో రూ.20.52 కోట్లు షేర్ ను వసూల్ చేసింది.

3) ఫిదా :

వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నైజాంలో రూ.18.35 కోట్లు షేర్ ను వసూల్ చేసింది.

4) ధమాకా :

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నైజాంలో రూ.18.01 కోట్లు షేర్ ను వసూల్ చేసింది.

5) జాతి రత్నాలు :

నవీన్ పోలిశెట్టి హీరోగా కె.వి.అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నైజాంలో రూ.16 కోట్లు షేర్ ను వసూల్ చేసింది.

6) ఉప్పెన :

వైష్ణవ్ తేజ్ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నైజాంలో రూ.15.63 కోట్లు షేర్ ను వసూల్ చేసింది.

7) ఇస్మార్ట్ శంకర్ :

రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నైజాంలో రూ.14.6 కోట్లు షేర్ ను వసూల్ చేసింది.

8) విరూపాక్ష :

సాయి తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నైజాంలో రూ.14.35 కోట్లు(ఇంకా రన్ అవుతుంది) షేర్ ను వసూల్ చేసి ఇంకా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.

9) ఎం.సి.ఎ :

నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నైజాంలో రూ.14.22 కోట్లు షేర్ ను వసూల్ చేసింది.

10) అఆ :

నితిన్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నైజాంలో రూ.13.19 కోట్లు షేర్ ను వసూల్ చేసింది.

ఇవి మాత్రమే కాదు ‘లవ్ స్టోరీ’ ‘క్రాక్’ ‘బింబిసార’ ‘ప్రతిరోజూ పండగే’ ‘సీతా రామం’ వంటి చిత్రాలు కూడా నైజాంలో రూ.10 కోట్లకు పైగా షేర్ ను కలెక్ట్ చేసి ఆల్ టైం రికార్డులు సృష్టించాయి. ఈ ఏడాది రాబోయే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ‘రామ్- బోయపాటి’ (కాంబోలో రూపొందే మూవీ) ‘టైగర్ నాగేశ్వర రావు’ నితిన్- వెంకీ కుడుముల(కాంబో).. వంటి క్రేజీ ప్రాజెక్టులు కూడా నైజాంలో భారీ వసూళ్లు సాధించే ఛాన్స్ ఉందని చెప్పాలి .

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus