ఒకప్పుడు ఓ సినిమా సృష్టించిన రికార్డుల గురించి చెప్పాలంటే.. అది ఎన్ని రోజులు ఆడిందో చెప్పేవారు… కొంచెం ట్రెండ్ మారిన తరువాత సినిమా ఎన్ని సెంటర్లలో వంద రోజులు ఆడిందో చెప్పేవారు… కానీ ఇప్పుడు వాటికి కాలం చెల్లిపోయింది. ఇప్పుడు వంద రోజుల సినిమాలు లేవు.. 100కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమాలు గురించే చెప్పుకోవాలి. అయితే ఓ సినిమా ఎక్కువ కలెక్షన్లు రాబట్టాలి అంటే.. రిలీజ్ ముందు నుండీ హైప్ క్రియేట్ అవ్వాలి. అది ఎలా ఏర్పడుతుంది అనేది ఆ సినిమా యొక్క టీజర్, ట్రైలర్ లకు నమోదైన లైకులు, వ్యూస్ ను ఆధారం చేసుకునే చెప్పగలం. యూట్యూబ్ లో నమోదయ్యే ఈ రికార్డులని సదరు హీరో అభిమానులు కూడా చాలా ప్రెస్టీజియస్ గా తీసుకుని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తుంటారు.
తద్వారా సినిమాకి రికార్డు ఓపెనింగ్స్ నమోదవుతాయనేది వారి బలమైన నమ్మకం. ముఖ్యంగా ట్రైలర్ విడుదల చేసిన 24 గంటల్లో ఎన్ని లైకులు వచ్చాయి అన్నది మెయిన్ పాయింట్. దానిని బట్టి ఆ సినిమా కమర్షియల్ ఎంత వరకూ వర్కౌట్ అవుతుంది అనేది అంచనా వేసేస్తూ ఉంటారు. గతేడాది మార్చి నుండీ జనాలు కరోనా కారణంగా ఇళ్లల్లోనే ఉండడంతో.. సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. 24 గంటల్లో ఎక్కువ లైకులు సాధించిన సినిమా ట్రైలర్లను ఓ లుక్కేద్దాం రండి :
1) వకీల్ సాబ్ : పవన్ కళ్యాణ్ నుండీ రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’ ట్రైలర్ కు.. 24 గంటల్లో 1.006M* లైక్ లు పడ్డాయి.
2) బాహుబలి2 : రాజమౌళి- ప్రభాస్ ల బాహుబలి ది కన్క్లూజన్ ట్రైలర్ కు 24 గంటల్లో 497 K లైక్ లు పడ్డాయి.
3) సాహో : ప్రభాస్ ‘సాహో’ ట్రైలర్ కు 24 గంటల్లో 392K లైక్ లు నమోదయ్యాయి.
4) సరిలేరు నీకెవ్వరు : మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ట్రైలర్ 24 గంటల్లో 347K లైక్స్ ను నమోదుచేసింది.
5) సైరా : మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ ట్రైలర్ కు 24 గంటల్లో 341K లైక్స్ నమోదయ్యాయి.
6) అరవింద సమేత : ఎన్టీఆర్- త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ ట్రైలర్ కు 24 గంటల్లో 327K లైక్స్ నమోదయ్యాయి.
7) అల వైకుంఠపురములో : అల్లు అర్జున్ – త్రివిక్రమ్ ల ‘అల’ ట్రైలర్ కు 24 గంటల్లో 326K లైక్స్ పడ్డాయి.
8) జాతి రత్నాలు : లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘జాతి రత్నాలు’ ట్రైలర్ 24 గంటల్లో 315K లైక్స్ ను నమోదు చేసింది.
9) ఉప్పెన : వైష్ణవ్ తేజ్ డెబ్యూ మూవీ అయిన ‘ఉప్పెన’ ట్రైలర్ కూడా 24 గంటల్లో 284.5K లైక్స్ ను సాధించింది.
10) అజ్ఞాతవాసి : పవన్ కళ్యాణ్- త్రివిక్రమ్ ల ‘అజ్ఞాతవాసి’ ట్రైలర్ కూడా 24 గంటల్లో 272K లైక్స్ ను నమోదు చేసింది.
11) చెక్ : 24 గంటల్లో 258K లైక్స్ ను నమోదు చేసింది
12) వినయ విధేయ రామ : 24 గంటల్లో 238K లైక్స్ ను నమోదు చేసింది
13) డియర్ కామ్రేడ్ : 24 గంటల్లో 234K లైక్స్ ను నమోదు చేసింది
14) వి : 24 గంటల్లో 224K లైక్స్ ను నమోదు చేసింది
15) క్రాక్ : 24 గంటల్లో 205.3K లైక్స్ ను నమోదు చేసింది
16) మహర్షి : 24 గంటల్లో 197K లైక్స్ ను నమోదు చేసింది
17) వరల్డ్ ఫేమస్ లవర్ : 24 గంటల్లో 185K లైక్స్ ను నమోదు చేసింది
18)లక్ష్మీస్ ఎన్టీఆర్ : 24 గంటల్లో 182K లైక్స్ ను నమోదు చేసింది
19) రెడ్ : 24 గంటల్లో 176K లైక్స్ ను నమోదు చేసింది
20)జై లవ కుశ : 24 గంటల్లో 174K లైక్స్ ను నమోదు చేసింది
21)రంగస్థలం : 24 గంటల్లో 157K లైక్స్ ను నమోదు చేసింది
22) కాటమరాయుడు : 24 గంటల్లో 156K లైక్స్ ను నమోదు చేసింది
23) శ్రీకారం : 24 గంటల్లో 154.6K లైక్స్ ను నమోదు చేసింది
24) 30 రోజుల్లో ప్రేమించడం ఎలా : 24 గంటల్లో 148.2K లైక్స్ ను నమోదు చేసింది
25) ఇస్మార్ట్ శంకర్ : 24 గంటల్లో 145K లైక్స్ ను నమోదు చేసింది