బాలీవుడ్ స్టార్స్ కు చుక్కలు చూపించిన సినిమాల లిస్ట్ ఇదే!

ఈ ఏడాది విడుదలైన సినిమాలలో సౌత్ సినిమాల హవా ఎక్కువగా కొనసాగింది. పలు సౌత్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంచనాలకు మించి విజయం సాధించాయి. ఈ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచి ప్రేక్షకులను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి. బాలీవుడ్ ఇండస్ట్రీ సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సౌత్ సినిమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. సౌత్ సినిమాలకు ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమాలు ఇతర భాషల్లో డబ్ అవుతున్నాయి..

ఈ ఏడాది బాలీవుడ్ సంచలనాలు సృష్టించిన సౌత్ సినిమాల జాబితాలో కేజీఎఫ్ ఛాప్టర్2 ముందువరసలో ఉంది. హిందీలో ఈ సినిమా ఏకంగా 435 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 1200 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆర్ఆర్ఆర్ కూడా అంచనాలను మించి సక్సెస్ సాధించడం గమనార్హం. ఈ సినిమా కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలో 277 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది.

ఆర్ఆర్ఆర్ మూవీ కూడా 1200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం కలెక్షన్లను అందుకుంది. ఈ జాబితాలో మూడో స్థానంలో కాంతార నిలిచింది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 82 కోట్ల రూపాయల కలెక్షన్లను అందుకుంది. నిఖిల్, అనుపమ జంటగా నటించిన కార్తికేయ2 సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో 30 కోట్ల రూపాయల కలెక్షన్లను అందుకుంది.

అడివి శేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మేజర్ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీలో 15 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకోవడం గమనార్హం. సౌత్ సినిమాలు బాలీవుడ్ స్టార్ హీరోలకు చుక్కలు చూపించాయి. 2023లో కూడా సౌత్ సినిమాల హవా కొనసాగుతుందేమో చూడాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus