వాల్తేరు వీరయ్య సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా వీరసింహారెడ్డి సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ కానున్న ఈ రెండు సినిమాల కోసం మెగా, నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగా ఫ్యాన్స్ వాల్తేరు వీరయ్య ఇండస్ట్రీ హిట్ గా నిలవాలని కోరుకుంటుండగా నందమూరి ఫ్యాన్స్ వీరసింహారెడ్డి రికార్డులను క్రియేట్ చేయాలని భావిస్తున్నారు. ఈ రెండు సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో థియేటర్లు దక్కే అవకాశాలు కనిపించడం లేదు.
అందువల్ల ఈ రెండు సినిమాలలో కలెక్షన్ల విషయంలో ఏ సినిమా పై చేయి సాధిస్తుందనే చర్చ జరుగుతోంది. వీరసింహారెడ్డి నుంచి విడుదలైన సుగుణ సుందరి సాంగ్ ప్రేక్షకులకు తెగ నచ్చేసిందనే సంగతి తెలిసిందే. ఈ సాంగ్ లో బాలయ్య, శృతి హాసన్ డ్యాన్స్ స్టెప్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. సుగుణ సుందరి సాంగ్ కు 5 రోజుల్లో 9.8 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎన్నిసార్లు చూసినా ఈ సాంగ్ ను మళ్లీ చూడాలనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సుగుణ సుందరి లిరికల్ వీడియో ఫ్యాన్స్ ను అంచనాలను మించి మెప్పించింది. మరోవైపు శ్రీదేవి చిరంజీవి సాంగ్ కు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్లో పాయిజన్ లా రిపీట్ మోడ్ లో ఆడియన్స్ కు ఈ సాంగ్ తెగ నచ్చేసింది. శ్రీదేవి చిరంజీవి సాంగ్ విషయానికి వస్తే ఈ సాంగ్ కు ఒక్కరోజులో 5.9 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ సాంగ్ లో చిరంజీవి, శృతి హాసన్ లుక్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి.
ఈ రెండు సాంగ్స్ అద్భుతంగా ఉన్నాయని ఒక సాంగ్ ఎక్కువ అని మరో సాంగ్ తక్కువ అని చెప్పలేమని ఫ్యాన్స్ చెబుతున్నారు. దేవిశ్రీ ప్రసాద్, థమన్ ఈ రెండు సినిమాలకు తమ వంతు న్యాయం చేస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?
2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!