కేజీఎఫ్2 సినిమాకు అన్ని భాషల్లో హిట్ టాక్ వచ్చినా ఫస్ట్ వీక్ తర్వాత ఈ సినిమా హవా తగ్గిందనే సంగతి తెలిసిందే. కర్ణాటకలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది. ఏపీలోని కొన్ని ఏరియాలలో కేజీఎఫ్2 హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు వచ్చాయని కామెంట్లు వినిపిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో కేజీఎఫ్2 సినిమాకు ఆర్ఆర్ఆర్ మూవీ గట్టి పోటీని ఇచ్చింది. అయితే ఈ సినిమా హవాకు బ్రేకులు పడినట్టేనని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య సినిమా విడుదల కావడంతో కేజీఎఫ్2 సినిమా మెజారిటీ థియేటర్లను కోల్పోయింది. ఆచార్య సినిమాకు హిట్ టాక్ రాకపోయినా ప్రేక్షకులకు ఈ సినిమానే ఫస్ట్ ఛాయిస్ గా ఉండే అవకాశం అయితే ఉంది. హిందీలో కూడా ఈరోజు ఎక్కువ సంఖ్యలో కొత్త సినిమాలు థియేటర్లలో విడుదల కావడం గమనార్హం. కేజీఎఫ్2 జోరుకు ఇక బ్రేకులు పడ్డట్టేనని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఈ సినిమాకు 480 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి.
ఫుల్ రన్ లో ఈ సినిమా 500 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించే అవకాశం అయితే ఉంది. కేజీఎఫ్2 మూవీ బడ్జెట్ కు ఈ కలెక్షన్లు భారీ మొత్తమేనని చెప్పవచ్చు. నిర్మాతలకు ఈ సినిమా బాగానే లాభాలను అందించింది. కేజీఎఫ్3 సినిమా గురించి వచ్చిన వార్తలు సైతం కేజీఎఫ్2 కలెక్షన్లకు ప్లస్ అయ్యాయి. ఇప్పటికే థియేటర్లలో కేజీఎఫ్2 సినిమాను చూసిన ప్రేక్షకులు కేజీఎఫ్2 ఓటీటీ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ ఓటీటీకి కేజీఎఫ్2 కచ్చితంగా ప్లస్ అవుతుందని చెప్పవచ్చు.
సాధారణంగా అమెజాన్ ప్రైమ్ తక్కువ సమయంలోనే పెద్ద సినిమాలను స్ట్రీమింగ్ చేస్తుంది. మరో రెండు వారాల తర్వాత కేజీఎఫ్2 మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కేజీఎఫ్3 సినిమాను మేకర్స్ కళ్లు చెదిరే బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని సమాచారం.
Most Recommended Video
కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!