‘టూరిస్ట్ ఫ్యామిలీ’ సినిమాతో ఒక్క హిట్ కొట్టి ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన యంగ్ డైరెక్టర్ అభినవ్ జీవింత్.. సైలెంట్‌గా ఓ ఇంటివాడయ్యాడు. తన గర్ల్‌ఫ్రెండ్ అఖిలను పెళ్లాడి బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.కొద్ది రోజుల క్రితం జరిగిన ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, స్టేజ్‌పైనే తన లవ్ స్టోరీని రివీల్ చేశాడు అభినవ్.
అక్టోబర్ 31న పెళ్లి చేసుకుంటానని ఫ్యాన్స్ ముందే ప్రకటించాడు. చెప్పిన మాట ప్రకారం, తన ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు. ఈ యంగ్ అండ్ హ్యాండ్‌సమ్ డైరెక్టర్‌కు ఇంత త్వరగా పెళ్లి అయిపోవడంతో లేడీ ఫ్యాన్స్ కాస్త హర్ట్ అవుతున్నారు. అదే సమయంలో, కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇదిలా ఉంటే, అభినవ్ తన కెరీర్‌లో మరో పెద్ద స్టెప్ తీసుకున్నాడు.

డైరెక్టర్‌గానే కాకుండా ఇప్పుడు హీరోగా కూడా తన లక్ ట్రై చేయబోతున్నాడు. సూపర్‌స్టార్ రజినీకాంత్ కుమార్తె సౌందర్య రజినీకాంత్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో అభినవ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్‌కు మదన్ దర్శకత్వం వహిస్తుండగా, అనన్య రాజన్ హీరోయిన్‌గా ఫిక్స్ అయింది. ఇప్పటికే షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా, త్వరలోనే టైటిల్ అనౌన్స్ చేయనున్నారు.
ఒకవేళ హీరోగా అభినవ్ చేస్తున్న సినిమా కూడా ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ అయితే, అతని కెరీర్‌కు తిరుగుండదు. పెళ్లైన వేళావిశేషం అతనికి అవకాశాల వెల్లువ కురిపిస్తోందని, ఈ సక్సెస్‌తో అతని భార్య అఖిల కూడా స్టార్ సెలబ్రిటీ అయిపోవడం ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
