హీరో దర్శకుడి మధ్య ‘గొడవ’ – ఫేస్‌బుక్‌లోకి వచ్చేసిన సినిమా!

మామూలుగానే సినిమా షూటింగ్‌ అవుతుండగా.. దొంగతనం మొబైల్‌ ఫోన్స్‌లో షూట్‌ చేసి లీకులు ఇచ్చేస్తున్నారు. ఇలాంటి లీకురాయుళ్లను తట్టుకోవడానికి దర్శకులు నానా తంటాలు పడుతున్నారు. హీరోల ఫ్యాన్స్‌ అయితే తమ అభిమాన హీరోకు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండమని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఓ సినిమాకు సినిమా లీక్‌ అయితే… మొత్తంగా ఫేస్‌బుక్‌లోకి వచ్చేస్తే.. ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో చెప్పండి. ఇదంతా చదువుతుంటే ‘అత్తారింటికి దారేది’ నాటి పరిస్థితులు గుర్తొస్తాయి. ఆ సినిమా కూడా ఇలానే బయటకు వచ్చేసింది.

అయితే ఈ సినిమా పరిస్థితి వేరు, ఇప్పుడు ఎఫ్‌బీలోకి వచ్చేసిన సినిమా పరిస్థితి వేరు. టొవినో థామస్ గురించి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేదు. మలయాళ సినిమాల డబ్బింగ్‌ వెర్షన్స్‌ను బాగా ఫాలో అవుతున్న తెలుగు వాళ్లకు ఆయన సుపరిచితుడే. ఇప్పుడు ఆయన సినిమానే ఫేస్‌బుక్‌లోకి వచ్చేసింది. సనల్ కుమార్ శశిధరన్ అనే దర్శకుడు టొవినో థామస్‌తో ‘వజక్కు’ అనే సినిమా తీశారు. ఎప్పుడో రెండేళ్ల క్రితమే పూర్తయిన ఈ సిని మా ఇంకా విడుదల కాలేదు.

ఫస్ట్ కాపీ సిద్ధమై సెన్సార్‌కు వెళ్లాల్సిన సమయంలో టొవినోకు, సనల్‌కు మధ్య గొడవలు వచ్చాయి. ఈ విషయం తేల్చుకుని సినిమాను రిలీజ్‌ చేద్దామని టీమ్‌ చాలా రోజులుగా అనుకుంటూ ఉంది. అయితే ఏమైందో ఏమో సినిమాను ఏకంగా ఫేస్ బుక్‌లో షేర్ చేశారు. సినిమా విమో లింక్‌ను సనల్‌ ఎఫ్‌బీలో షేర్‌ చేయడంతో అందరూ చూసేశారు. దీంతో టొవినో థామస్ షాక్ తిన్నాడు.

ఎందుకంటే ఆ సినిమాకు నిర్మాత కూడా ఆయనే కాబట్టి. ఇక సినిమా బాగా రాలేదనే కారణంతో ‘వజిక్కు’ సినిమా విడుదల రాకుండా అడ్డుకున్నాడని సనల్ కుమార్ అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరూ తేల్చుకోకుండా ఇలా చేయడం సరికాదనే చర్చ నడుస్తోంది. మరి ఈ విషయంలో టొవినో ఏం చేస్తారు, దానికి సనల్‌ కుమార్‌ ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus