కొన్నాళ్ళుగా రవితేజ (Ravi Teja) నటించిన సినిమాల్లో హీరోయిన్లు హాట్ టాపిక్ అవుతున్నారు. అది కూడా ట్రోలింగ్ వల్లే అనడంలో సందేహం లేదు. చిరంజీవి (Chiranjeevi), బాలకృష్ణ (Nandamuri Balakrishna), వెంకటేష్ (Venkatesh), నాగార్జున (Nagarjuna) వంటి సీనియర్ స్టార్ హీరోలు రవితేజ కంటే పెద్ద వయసు కలిగిన వారే. వాళ్ళు కూడా యంగ్ హీరోయిన్లతో నటిస్తున్నారు. కానీ వాళ్ళు హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఇష్టపడరు. వాళ్ళ ఏజ్ ను, ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని హీరోయిన్లతో నటిస్తూ ఉంటారు.
కానీ రవితేజ (Raviteja) సంగతి వేరు. ఎందుకంటే రవితేజ యంగ్ హీరోయిన్లతో కూడా రొమాన్స్ ఎక్కువగా చేస్తుంటారు. భాగ్య శ్రీ బోర్సే (Bhagyashree Borse) తో ‘మిస్టర్ బచ్చన్’ (Mr. Bachchan) లో రవితేజ చేసిన రొమాన్స్ పై ఎన్ని నెగిటివ్ కామెంట్లు వచ్చాయో అందరికీ తెలుసు. అంతకు ముందు ‘ధమాకా’ (Dhamaka) లో శ్రీలీల (Sreeleela) విషయంలో కూడా అలాంటి నెగిటివ్ కామెంట్సే వచ్చాయి. అయినప్పటికీ రవితేజ కొత్త హీరోయిన్లు లేదా ట్రెండింగ్లో ఉంటున్న హీరోయిన్లని ఎంపిక చేసుకుంటూ పోతున్నాడు.
ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’ (Mass Jathara) సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో శ్రీలీల హీరోయిన్. దీని తర్వాత కిషోర్ తిరుమల (Kishore Tirumala) దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ డ్రామా చేయబోతున్నాడు. ఇందులో కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. అందుకోసం ట్రెండింగ్లో ఉన్న మామితా బైజు (Mamitha Baiju), కయాడు లోహర్ (Kayadu Lohar)..ని ఎంపిక చేసుకున్నారు అని సమాచారం.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రాలేదు కానీ.. వీళ్ళు కనుక కన్ఫర్మ్ అయితే సినిమాకి బజ్ ఏర్పడటం ఖాయం. మరోపక్క వీళ్ళ పారితోషికాలు లెక్క కూడా ఎక్కువే అని సమాచారం. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నట్టు తెలుస్తుంది.