Tripti Dimri: నటి త్రిప్తి డిమ్రీ కి ఇష్టమైన టాలీవుడ్ హీరోఎవరో తెలిస్తే వావ్ అంటారు..!

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో తెరకెక్కిన యానిమల్ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది కానీ కలెక్షన్స్ మాత్రం ఒక రేంజ్ లో వచ్చి పడుతున్నాయి. ఈ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా నటించగా ఈ సినిమా మొత్తం మీద జోయా అనే పాత్రలో నటించిన తృప్తి డిమ్రీ మాత్రం సూపర్ హైలైట్ అయింది.

ఇక అంతకు ముందే ఆమె పలు సినిమాల్లో నటించింది కానీ ఆమెకు ఈ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కింది. నిజానికి ఈ సినిమా విడుదలకు ముందు ఆమె ఇన్స్టాగ్రామ్ లో సుమారు 600K ఫాలోవర్లను కలిగి ఉండగా ఇప్పుడు, ఆమెకు 3.5 మిలియన్ల మంది ఫాలోవర్స్ వచ్చారు. ఇక ఈ సినిమాలో తృప్తి డిమ్రీ రణబీర్ కపూర్ మధ్య ఉన్న ఇంటిమేట్ సీన్స్ ఇప్పటికీ చర్చనీయాంశం అవుతూనే ఉన్నాయి.

తాజాగా తృప్తి డిమ్రీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. ఈ ఇంటర్వ్యూలో తృప్తి డిమ్రీ కి ఒక్క ప్రశ్న ఎదురైనది.. ఇప్పుడు ఆ ప్రశ్న వైరల్ గా మారింది. అది ఏంటంటే టాలీవుడ్ లో మీకు నచ్చిన హీరో ఎవరని యాంకర్ అడగగా.. వెంటనే తృప్తి డిమ్రీ ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది.

తృప్తి డిమ్రీ (Tripti Dimri) పోస్టర్ బాయ్స్ అనే కామెడీ చిత్రం తో సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. తరువాత రొమాంటిక్ డ్రామా లైలా మజ్ను లో ఆమె మొదటి ప్రధాన పాత్రను పోషించింది. ఆమె అన్వితా దత్ పీరియాడికల్ ఫిల్మ్ బుల్బుల్ నటించింది. ఖలా సినిమా తో గుర్తింపు పొందింది . ప్రస్తుతం ఆమె చేతిలో ఎన్ని సినిమాలు ఉన్నాయో తెలియాల్సి ఉంది.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus