Trisha: ‘వరిసు’ థియేటర్‌లో ఫ్రెండ్స్‌తో కలిసి సందడి చేసిన త్రిష.. వైరల్ అవుతున్న వీడియో..!

ఇళయ దళపతి విజయ్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో దిల్ రాజు నిర్మించిన ద్విభాషా చిత్రం ‘వరిసు’.. తెలుగులో ‘వారసుడు’.. రష్మిక మందన్న కథానాయిక. జయసుధ, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, సంగీత వంటి భారీ తారాగణంతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 11న భారీ స్థాయిలో విడుదలైంది. ఇక తమిళనాట విజయ్‌కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెలబ్రిటీల్లోనూ చాలా మంది విజయ్ ఫ్యాన్స్ ఉన్నారు.

హీరోయిన్ త్రిష కూడా దళపతి అభిమానే కావడంతో ఉదయాన్నే ‘వరిసు’ థియేటర్లో ప్రత్యక్షమైంది. ఆమె చివర్లో నిలబడి సినిమా చూస్తుండగా విజయ్ ఫ్యాన్స వీడియో తీశారు. తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో త్రిష ‘వరిసు’ మూవీని ఎంజాయ్ చేసింది. చెన్నైలోని ఓ మల్టీప్లెక్స్‌లో త్రిష సినిమా చూస్తున్న వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.. తెలుగులో ‘వారసుడు’ జనవరి 14న గ్రాండ్‌గా విడుదలవుతోంది. చిత్రం చూశాక మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కంటతడి పెట్టుకున్న వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus