బాలీవుడ్‌లో అనుష్క శర్మ నటించిన ‘ఎన్‌హెచ్ 10’ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని నమోదు చేసింది. ఆ చిత్రాన్ని తమిళంలో ‘గర్జనై’ పేరుతో రీమేక్ చేసేందుకు అప్పట్లో సన్నాహాలు జరిగాయి. ఫస్ట్ లుక్ పోస్టర్ & టీజర్ కూడా విడుదలయ్యాక.. ఆ ప్రొజెక్ట్ ఏమైందో ఎవరికీ తెలియకుండాపోయింది. సుందర్ బాలు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం వాస్తవానికి తమిళనాట జల్లికట్టుకు మద్దతుగా చెన్నై మెరీనా తీరంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగినప్పుడే ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుండేది.
అప్పుడు పీపుల్ ఆఫ్ ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్(పెటా) కు మద్దతుగా త్రిష వ్యవహరించడంతో ఈ సినిమా చిత్రీకరణను ఆందోళనకారులు అడ్డుకున్నారు. కొన్నిరోజుల పాటు చిత్రీకరణ కూడా ఆగిపోయింది. చివరకు షూటింగ్ పూర్తయినా సినిమా మాత్రం విడుదల కాలేదు. ఇప్పుడు ఈ సినిమా విడుదల హక్కులను ఎస్‌టీసీ ఫిక్చర్స్ సంస్థ కొనుగోలు చేసింది. త్వరలో విడుదల చేయబోతుంది.
ఆ సినిమా కథ-కథనంతోపాటు త్రిష క్యారెక్టర్ కూడా బాగున్నప్పటికీ.. మరీ ఇన్నాళ్ల తర్వాత ఆ సినిమా విడుదలవ్వడం త్రిష కెరీర్ కి పెద్దగా ఉపయోగపడకపోగా.. మైనస్ గా మారే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మరి త్రిష కాస్త స్పందించి ఏమైనా ముందు జాగ్రత్తలు తీసుకొంటుందో లేక ఎప్పట్లానే లైట్ తీసుకొంటుందో చూడాలి.