Trisha : పురుషుడిగా ఉండి ఆ విషయాలు తెలుసుకోవాలన్న త్రిష.. కానీ?

టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో త్రిష ఇప్పటికీ వరుస ఆఫర్లను అందుకుంటూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. నాలుగు పదుల వయస్సులో సైతం త్రిష (Trisha) గ్లామరస్ గా కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే త్రిష ఒక్కరోజైనా మగాడిలా ఉండాలని ఉందంటూ ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించే కామెంట్లు చేసి ఆ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఒకే ఒక్కరోజు పురుషుడిగా ఉండాలని నా కోరిక అని త్రిష వెల్లడించడం గమనార్హం.

ఒక యువకుడిగా ఉండటం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందని త్రిష పేర్కొన్నారు. కుర్రాడి శరీర రూపకల్పన, మానసిక స్థితి గురించి తెలుసుకోవాలని ఆశగా ఉందని ఆమె తెలిపారు. అమ్మతో కూడా ఈ విషయం గురించి నేను పదే పదే చెబుతానని త్రిష కామెంట్లు చేయడం గమనార్హం. త్రిష కోరిక విడ్డూరంగా ఉందని త్రిష కోరిక ఎప్పటికీ తీరే కోరిక అయితే కాదని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

త్రిష పారితోషికం పరంగా కూడా చాలామంది హీరోయిన్లతో పోల్చి చూస్తే టాప్ లోనే ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. త్రిషకు లేడీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ లలో సైతం ఆఫర్లు అయితే వస్తున్నాయని సమాచారం అందుతోంది. త్రిష కథల ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విశ్వంభర (Vishwambhara) సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమాలో త్రిష డ్యూయల్ రోల్ లో నటిస్తుండటం గమనార్హం.

త్రిష నిజంగా డ్యూయల్ రోల్ లో నటిస్తే మాత్రం సంచలనం అవుతుందని చెప్పవచ్చు. త్రిష రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాజెక్ట్ లకు ఓకే చెబుతారో చూడాల్సి ఉంది. వరుస సినిమాలలో నటిస్తున్న త్రిష పెళ్లికి సంబంధించిన శుభవార్తను ఎప్పుడు చెబుతారో తెలియాల్సి ఉంది. త్రిష ప్రస్తుతం సీనియర్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ గా నిలిచారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus